రవితేజ ‘కిక్‌-2’ :కీ సీన్ లీక్ (ఆశ్చర్యపరిచే ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లో ఏ విధంగా ఈ చిత్రం రూపు దిద్దుకుంటోందా చూడాలని ఉందా..వాటిలో కొన్ని కీలకమైన సన్నివేశాలకు సంభందించినవి బయిటకు వచ్చేసాయి . వాటిపై ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. త్వరలో హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ ఉంటుంది'' అని తెలిపారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేస్తున్నారు. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

స్లైడ్ షోలో ఫొటోలు...

 ఎంటర్టైన్మెంట్ బేసెడ్

ఎంటర్టైన్మెంట్ బేసెడ్

ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమని రవితేజ అన్నారు.

తండ్రి కొడుకుల కథ

తండ్రి కొడుకుల కథ

'కిక్'లో జంటగా నటించిన రవితేజ, ఇలియానా పాత్రల కొడుకు కథే ఈ 'కిక్ 2' అని దర్శకుడు తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రవితేజ మార్క్ ఎంటర్‌టైనర్‌తోపాటు సురేందర్ రెడ్డి, తమన్నా మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఈ చిత్రం మే 28, 2015న విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.

హాట్ హీరోయిన్

హాట్ హీరోయిన్

ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

మరింత కిక్

మరింత కిక్

రవితేజ పాత్ర శైలి, నటన మరోసారి ప్రేక్షకులకు కావల్సినంత కిక్‌ ఇస్తాయని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

కేవలం క్యారక్టరైజేషన్

కేవలం క్యారక్టరైజేషన్

సీక్వెల్ లో కేవలం క్యారెక్టరైజేషన్ కంటిన్యూ అవుతుందని అంటున్నారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత కిక్ సినిమా ముగుస్తుంది. కాబట్టి సీక్వెల్ లో పోలీస్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

విలనా..కమిడయినా

విలనా..కమిడయినా

ఆయన పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగుతుందని, కొంత ఫన్ కూడిన పాత్ర అదని అంటున్నారు. రాజపాల్ యాదవ్ అంటేనే కామెడీ ..మరి ఈ కామెడీ సినిమాలో ఆయన కామెడీ చేస్తారో లేక తొలి చిత్రంలో లాగ విలనీ చేస్తారో చూడాలి.

అదరకొడ్తాడని

అదరకొడ్తాడని

రవితేజ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ సమయంలో చేస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు

అందుకే...

అందుకే...

కళ్యాణ్ రామ్ తనకు అతనొక్కడే చిత్రంతో నమ్మి బ్రేక్ ఇచ్చినందుకే ..సురేంద్ర రెడ్డి ఈ క్రేజీ ప్రాజెక్టుని అతనికి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నా

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....

‘ఈ సినిమా ‘కిక్'కి సీక్వెల్ కాదుగానీ అందరికీ డబుల్ కిక్ ఇచ్చే సినిమా అవుతుంది. ‘కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్-2' అన్నారు.

రేసు గుర్రం తర్వాత

రేసు గుర్రం తర్వాత

అల్లు అర్జున్ తో చేసిన రేసు గుర్రం చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

బిజినెస్ క్రేజ్

బిజినెస్ క్రేజ్

సినిమాకు అప్పుడే బిజినెస్ క్రేజ్ మొదలైందని సమాచారం. మంచి రేట్లకే బిజినెస్ చేస్తున్నట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు

కళ్యాణ్ రామ్ టైమ్

కళ్యాణ్ రామ్ టైమ్

పటాస్ హిట్ అవటంతో కళ్యాణ్ రామ్ కు టైమ్ వచ్చిందంటున్నారు. ఇదే సమయంలో ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కావటం కూడా శుభ సూచనే.

లక్కీ గర్ల్

లక్కీ గర్ల్

హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ నటించిన ప్రతి చిత్రం హిట్ అవుతోంది. ఈ సెంటిమెంట్ ఈ చిత్రానికి కూడా వర్కవుట్ అవుతుందంటున్నారు

తెర వెనక...

తెర వెనక...

ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: యస్ యస్ థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్ : నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X