‘క్రాక్’ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన డైరెక్టర్: మాస్ మహారాజ రచ్చ అప్పటి నుంచే
ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ. యాభై ఏళ్లు దాటినా కుర్రాళ్లకు మించిన ఎనర్జీతో సాగిపోతోన్న ఆయన.. వేగంగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్.
పరాజయాల పరంపరకు పుల్‌స్టాప్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు సీనియర్ హీరో రవితేజ. ఇందుకోసం తనకు 'డాన్ శీను', 'బలుపు' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరోసారి జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'క్రాక్'. ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యమైంది. దీంతో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 14న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా డైరెక్టర్ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్‌గా నటిస్తుండగా... సముద్రఖని మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్‌ను వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం త్వరలోనే ట్రైలర్ వదలనుంది.


Click it and Unblock the Notifications











