రవితేజ సినిమా రిలీజ్‌కు బ్రేక్: చివరి నిమిషంలో ‘క్రాక్’ బుకింగ్స్ క్యాన్సిల్.. వాళ్ల వల్లే ఈ పరిస్థితి!

బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించి.. అద్భుతమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు అభిమాన హీరోగా నిలవడంతో పాటు మాస్ మహారాజా అనే బిరుదును అందుకున్నాడు. సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడీ హీరో. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు 'క్రాక్' అనే సినిమా చేశాడు. వాస్తవానికి ఈ మూవీ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

Recommended Video

Ravi Teja's Krack Pre Release Event | Filmibeat Telugu
హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జతకట్టారు

హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జతకట్టారు

గత ఏడాది 'డిస్కో రాజా' వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన రవితేజ.. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. శృతీ హాసన్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మించారు.

 రియల్ క్యారెక్టర్ల కథల ఆధారంగా వస్తోంది

రియల్ క్యారెక్టర్ల కథల ఆధారంగా వస్తోంది

రవితేజ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'క్రాక్'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. అది ఓ రియల్ హీరో కథ అని దర్శకుడు ఇటీవల వెల్లడించాడు. అంతేకాదు, ఇందులో నటించిన చాలా పాత్రలు నిజ జీవితంలో ఉన్నవేనని చెప్పాడు. వాటి ఆధారంగానే సినిమా చేసినట్లు తెలిపాడు.

రవితేజ కెరీర్‌లో భారీ రికార్డు నమోదైంది

రవితేజ కెరీర్‌లో భారీ రికార్డు నమోదైంది

నూతన సంవత్సర కానుకగా 'క్రాక్' ట్రైలర్ విడుదలైంది. దాదాపు రెండున్నర నిమిషాలు ఉన్న దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను ఇది బాగా ఆకట్టుకుంది. ఫలితంగా ఇది 24 గంటల్లోనే 7 మిలియన్ పైచిలుకు వ్యూస్ సాధించి, రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది.

చివరి నిమిషంలో క్రాక్ రిలీజ్‌కు బ్రేకులు

చివరి నిమిషంలో క్రాక్ రిలీజ్‌కు బ్రేకులు


సంక్రాంతి కానుకగా జనవరి 9న అంటే ఈరోజు 'క్రాక్' విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 11 వందల థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉంది. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ.. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు థియేటర్ల యజమానులు.

టికెట్ డబ్బులు ఇచ్చేస్తామని మెసేజ్‌లు

టికెట్ డబ్బులు ఇచ్చేస్తామని మెసేజ్‌లు

వాస్తవానికి శుక్రవారం రాత్రి అంటే 8వ తేదీనే అమెరికాలో ప్రీమియర్స్ పడాలి. కానీ, అనివార్య కారణాల వల్ల అవి కాస్తా రద్దు అయ్యాయి. అలాగే, మార్నింగ్ షో విషయాలోనూ సందిగ్ధత నెలకొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు రవితేజ అభిమానులు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

ఆ సెటిల్‌మెంట్ అవకపోవడమే కారణం

ఆ సెటిల్‌మెంట్ అవకపోవడమే కారణం

అమెరికాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 'క్రాక్' మార్నింగ్ షో రద్దు అయినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలు చివరి నిమిషంలో చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. డిస్టిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్లు పూర్తవకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. దీనిపై మాస్ మహారాజా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X