రవితేజ్ నేలటికెట్ ఫస్ట్‌లుక్ ఇదే.. పక్కా మాస్ అంటే ఇదే..
దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్‌లో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న నేలటికెట్ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది.
నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ సినిమాలో రవితేజ పాత్ర చిత్రీకరణ గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. కథకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టే ఈ చిత్రానికి నేల టిక్కెట్టు అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఇప్పటి వరకు 60 శాతం చిత్రీక్రణ పూర్తయింది. మే చివరి వారంలో నేల టికెట్‌ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని అన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖావాణి, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications











