twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నేల టిక్కెట్టు' ప్రీమియర్ షో టాక్: రవితేజని వాడుకోలేక.. ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక!

    |

    మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టికెట్ చిత్రం మంచి అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. వరుస పరాజయాలతో ఉన్న రవితేజకు రాజా ది గ్రేట్ చిత్రంతో ఓ హిట్ దక్కింది. ఆ తరువాత వచ్చిన టచ్ చేసి చూడు చిత్రం నిరాశ పరిచింది. ఈ తరుణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటించడంతో నేల టికెట్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. రవితేజ సరసన మాళవిక శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆమెకు ఇది డెబ్యూ మూవీ. ప్రీమియర్ షోల నుంచి వస్తున్న రెస్పాన్స్ బట్టి రవితేజకు అవసరమైన హిట్ దక్కిందా లేదా తెలుసుకుందాం.

    Recommended Video

    Nela Ticket Team Interview With Girls
    రవితేజ టైమింగ్, దర్శకుడిపై నమ్మకం

    రవితేజ టైమింగ్, దర్శకుడిపై నమ్మకం

    రవితేజ కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. రవితేజ నుంచి ఆడియన్స్ ఆశించేది కూడా అదే. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫ్యామిలీ అంశాలతో పాటు వినోదాత్మక అంశాలు కూడా చక్కగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఆడియన్స్ మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు.

    ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే

    ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే

    దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, రవితేజ నుంచి అభిమానులు ఆశించిన అంశాలు ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కనిపించవు. కథని మొదలుపెట్టిన విధానం, స్క్రీన్ ప్లే పూర్తిగా నిరాశపరిచే విధంగా ఉంటాయి. రవితేజ మార్క్ కామెడీ లేదు.

    సెకండ్ హాఫ్‌లో ఆకట్టుకునేవి ఇవే

    సెకండ్ హాఫ్‌లో ఆకట్టుకునేవి ఇవే

    నిరాశ కలిగించిన ఫస్ట్ హాఫ్ తరువాత సెకండ్ హాఫ్ కూడా అదేవిధంగా ప్రారంభం అవుతుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రం సెకండ్ హాఫ్ లో పరవాలేదనిపించేవిధంగా ఉంటాయి.

     రవితేజని వాడుకోవడంలో

    రవితేజని వాడుకోవడంలో

    ఎలాంటి కథ ఉన్నప్పటికీ రవితేజ లాంటి హీరో చేతిలో ఉంటె దర్శకుడి పని సామ్ సులువు అవుతుంది. గతంలో యావరేజ్ చిత్రాలని కూడా రవితేజ తన పెర్ఫామెన్స్ తో హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ రవితేజని ఉపయోగించుకోవడంలో దర్శకుడి వైఫల్యం కనిపిస్తోంది. అభిమానులు ఆశించే కామెడీ సన్నివేశాలు కూడా బోరింగ్ గా అనిపిస్తాయి.

    ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక

    ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేక

    కళ్యాణ్ కృష్ణ గతంలో రూపొందించిన సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చేద్దాం చిత్రాలు రొటీన్ కథలే. కానీ అందులో కళ్యాణ్ కృష్ణ సరైన విధంగా వినోదాన్ని జోడించి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. నేల టికెట్ చిత్రం సందేశంతో కూడుకున్న రొటీన్ కథ. కానీ కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ మిస్ అయింది.

    సంగీతం కూడా అదే పరిస్థితి

    సంగీతం కూడా అదే పరిస్థితి

    ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఫిదా చిత్రంతో మెప్పించిన సంగీత దర్శకుడు శక్తి ఈ చిత్రంతో నిరాశపరిచాడు.

     రవితేజ ప్రయత్నించాడు

    రవితేజ ప్రయత్నించాడు

    దర్శకుడి ఆలోచనల మేరకు, ఉన్న కథకు అనుగుణంగా ఆడియన్స్ ని రవితేజ ఆడియన్స్ ని మెప్పించడానికి ప్రయత్నించాడు. డెబ్యూ హీరోయిన్ అయినప్పటికీ మాళవిక శర్మ బాగానే నటించింది. కమర్షియల్ గా ఈ చిత్ర రిజల్ట్ ఏంటి అనే విషయం వీకెండ్ లోపు అర్ధమయ్యే అవకాశం ఉంది.

    English summary
    Ravi Teja's Nela Ticket Movie Premier show talk. Director Kalyan Krishna not able to repeat his magic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X