రవితేజ 'నిప్పు' అంటున్న దర్శకుడు గుణశేఖర్
ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గుణశేఖర్ త్వరలో రవితేజ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నిప్పు(ద ఫైర్) అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ వేసవి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి ఈ చిత్రానికి కత్తి అనే టైటిల్ ని అనుకుని స్క్రిప్టు రెడీ చేసారు. కానీ కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ ని తీసుకుని తన చిత్రానికి వాడుకున్న విషయం తెలిసిందే. ఆ వివాదం తర్వాత గుణశేఖర్ ఇప్పుడు ఈ చిత్రంతో బయిటకు రాబోతున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మరో దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం రవితేజ..రమేష్ వర్మ దర్శకత్వంలో వీర అనే చిత్రం, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దొంగల ముఠా అనే చిత్రాలు చేస్తున్నారు. అలాగే ఆయన నటించిన మిరపకాయ్ చిత్రం సంక్రాంతి విజేతగా నిలబడింది.
రవితేజ నిప్పు గుణశేఖర్ వైవియస్ చౌదరి మిరపకాయ్ హరీష్ శంకర్ gunasekhar ravi teja mirapakaya yvs cowdary ram gopal varma


Click it and Unblock the Notifications