twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ కి 'కత్తి' లాంటి ట్విస్ట్ ఇచ్చిన రవితేజా!?

    By Srikanya
    |

    కళ్యాణ్ రామ్ ఎంతో ముచ్చటపడి ఎంచుకున్న టైటిల్ 'కత్తి' టైటిల్ ని రవితేజ లాక్కెళ్ళిపోయాడు. తాజాగా రవితేజ,గుణశేఖర్ కాంబినేషన్ లో రెడీ కానున్న చిత్రానికి 'కత్తి' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రెస్ నోట్ విడుదలచేసారు. దాంతో కళ్యాణ్ రామ్ కి మింగుడుపడని పరిస్ధితి. ఎందుకంటే 'కత్తి' టైటిల్ దానయ్య రిజిస్టేషన్ చేసారు. ఇక 'కత్తి' టైటిల్ తో గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చిత్రం చేద్దామని ప్రయత్నాలు జరిగాయి. అయితే అనుకోని పరిణామాలతో అవన్నీ ఆగిపోయాయి. దాంతో ఆ 'కత్తి' టైటిల్ తుప్పుపట్టి మూలనపడిపోయింది.

    ఇప్పుడు దాన్ని బయిటకు తీసి తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. అయితే అనుకోని విధంగా సీన్ లోకి రవితేజ వచ్చి రచ్చ చేసాడు. కత్తి టైటిల్ అడిగితే డైరక్ట్ ఇవ్వననలేక నిర్మాతే ఈ విధంగా చేసాడని మరో ప్రక్క వినపడుతోంది. ఇక బయిట ఈ కత్తి టైటిల్ గురించి ఇంత వివాదం చెలరేగుతోందని తెలిసినా రవితేజ ఆ ఊసే ఎత్తకుండా కమిటయ్యాడని అంటున్నారు. అంటే కావాలనే ట్విస్ట్ ఇవ్వడానికే రవితేజా కూడా కత్తి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇఖ కళ్యాణ్ రామ్ అభిమన్యు మల్లి తో చేస్తున్న చిత్రంకోసం ఈ టైటిల్ ని పెట్టాలని డిసైడ్ అయ్యారు.

    ఇక కళ్యాణ్ రామ్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మీడియాకు న్యూస్ ఇవ్వకుండా చేస్తున్న ఈ చిత్రంకి మొదట హరేరామ హరే కృష్ణ అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఈ టైటిల్ వేరే వారి దగ్గర ఉండటంతో మనస్సు మార్చుకుని కళ్యాణ్ రామ్ 'కత్తి' దగ్గర ఆగాడని,ఇదీ ఇలా అవటంలో మరో టైటిల్ కోసం వెతకాలనే నిర్ణయానకి వచ్చాడని చెప్తున్నారు. అయినా కథలో దమ్ముంటే ఏ టైటిల్ పెట్టినా కత్తిలాగ ఆడుతుందనేది నిజం.

    ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం ద్వారా సనా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె ఇంతకుముందు ఓ తమిళ చిత్రం చేసింది. ఇక విలేజ్ లో వినాయకుడు చిత్రంలో చేసిన శరణ్యా మోహన్..కళ్యాణ్ రామ్ చెల్లిగా కీరోల్ చేస్తోంది. రవితేజ కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా చేసిన శ్యామ్ మరో కీలకపాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందించే ఈ చిత్రం తనకు మరో సూపర్ హిట్ ని అందిస్తుందని కళ్యాణ్ రామ్ నమ్మకంగా ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X