నేనంటే వైవియస్ చౌదరికి చాలా కోపం:దాసరి
నేను ఏఎన్నార్‌కు 'ప్రేమాభిషేకం' ఇచ్చానని ఒకప్పుడు వైవియస్‌కు నామీద చాలా కోపం ఉండేది. ఎన్టీఆర్‌కి చౌదరి వీరాభిమాని అన్నారు ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు. ఆయన చేతుల మీదుగా 'నిప్పు' చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రంలో రవితేజ, దీక్షాసేథ్ జంటగా నటించారు. గుణశేఖర్ దర్శకుడు. వైవీఎస్ చౌదరి నిర్మాత. తమన్ స్వరాలు సమకూర్చారు. తొలి సీడీని దాసరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కొత్తవాళ్ళతో వైవియస్ చేసిన 'దేవదాస్' చూసిన తర్వాత అతని మీద గౌరవం పెరిగింది. చౌదరి, గుణశేఖర్ భిన్న దృవాలు. అయినా కలిసి సినిమా చేయడం ఆనందకరం. తారల్ని సృష్టించేది దర్శకుడే అని ఎప్పుడూ చెబుతుంటాను. వైవీఎస్ చౌదరి, గుణశేఖర్... ఈ ఇద్దరూ కూడా ఆ దారిలో నడిచినవాళ్లే కావటం అభినందనీయం. ఒక సృజనాత్మక దర్శకుడు అలాంటి మరొక దర్శకుడితో సినిమా తీయటమనేది మంచి ఆలోచన అన్నారు. అలాగే ..రవితేజ విరామం తీసుకోకుండా రవితేజ యేడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నాడు. సినిమాపై తనకున్న శ్రద్ధ మెచ్చుకోదగినది. హీరోలు నెమ్మదిగా ఉన్నప్పుడు రవితేజను చూసి నేర్చుకోమని చెప్పేవాడిని. ఇప్పుడు అందరు హీరోలు సినిమా మీద సినిమా చేస్తుంటే ఆనందంగా ఉంది. థమన్ మంచి సంగీత దర్శకుడు అవుతాడని ఎప్పుడో చెప్పాను అన్నారు. ఇక 'నిప్పు' మెప్పిస్తుంది'' అని గుణశేఖర్ చెప్పారు. రవితేజ మాట్లాడుతూ "ఆది నుంచి నా శ్రేయోభిలాషి వై.వి.యస్.చౌదరి. మళ్ళీ వెంటనే సినిమా చేయాలనిపించేంత గొప్పగా నిర్మాణ విలువలను పాటించాడు. థమన్ బాణీలు బావున్నాయి. శ్రీధర్ మంచి సంభాషణల రచయిత అవుతాడు'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











