మా ముగ్గురి కెరీర్ కు రవితేజ ‘నిప్పు’ ల్యాండ్ మార్క్..!
విశ్రాంతి లేకుండా సినిమాలు చేసే కథానాయకుల్లో రవితేజ ఒకరు. ఆయన ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'నిప్పు". ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత చౌదరి మాట్లాడుతూ ' రవితేజ, నేను, గుణశేఖర్ ముగ్గురం కెరీర్ ప్రారంభంలో రూమ్ మేట్స్‌గా వుండటం ఇప్పుడు మా కలయికలో ఈ చిత్రం రూపొందడం ఆనందంగా వుంది. డిసెంబర్ 9వరకు హైదరాబాద్‌లో షెడ్యూల్ చేసి, 10 నుంచి 20 వరకు సౌది అరేబియాలో అరుదైన లోకేషన్స్ లో చిత్రీకరణ చేస్తాం. తప్పకుండా మా ముగ్గురి కెరీర్‌కు 'నిప్పు" ల్యాండ్‌మార్క్ చిత్రమవుతుంది" అన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ ' రవితేజ మార్క్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ చిత్రం వుంటుంది. ప్రముఖ నటుడు డా.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం చిత్రానికి ప్లస్ అయ్యే విధంగా వుంటుంది" అని తెలిపారు. దీక్షాసేత్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్ దేవ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.ఆర్.కిషోర్, సహ నిర్మాతలు: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత.


Click it and Unblock the Notifications











