twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొల్లాచిలో రవితేజ, దీక్షాసేథ్ రొమాన్స్...?!

    By Sindhu
    |

    అన్నీ సవ్యంగా వున్నప్పుడు ఏదీ ఆలోచించం. స్పీడుగా వెళ్ళిపోతుంటాం. ఒక్కసారి ఎదురుదెబ్బ తిన్నప్పుడే మన స్పీడుకి బ్రేక్ పడుతుంది. ఇప్పుడు హీరో రవితేజ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇటీవల వచ్చిన 'వీర' సినిమా అతని స్పీడుకి ఓ రకంగా బ్రేక్ వేసిందనే చెప్పాలి. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద పేలిపోవడంతో ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు.

    కథ పక్కాగా లేనిదే ఏ సినిమా కూడా స్టార్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యి భారీ మార్పులు, చేర్పులు మద్య మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నిప్పు". గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ సరసన దీక్షాసేథ్ హీరోయిన్ గా నటిస్తుంది. బొమ్మరిల్లు బ్యానర్ లో ప్రముఖ దర్శక, నిర్మాత వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

    దీనికంటే ముందు రవితేజ 'వీర" సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టింది అలాగే గుణ శేఖర్ ఖాతా లో కూడా వరుడు లాంటి ఫ్లాప్ సినిమా ఉంది. దీనితో ఇద్దరు కలిసి మంచి సూపర్ హిట్ సినిమా చేద్దాం అనే తపన తో నిప్పు మొదలు పెట్టారు. అంతే కాదు రవి తేజ సరసన మిరపకాయ్ ఫేం దీక్షాసేథ్ నటిస్తోంది. దీక్షకి కూడా ఇప్పటివరకు మంచి హిట్ లేదు. ఈ సినిమా హిట్ అవడంఅందరికి చాలా అవసరం.

    హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఈ సినిమా పొల్లాచ్చి లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పాటల చిత్రీకరణ తో పాటు కొన్ని టాకీ సన్నివేశాలని కూడా చిత్రిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా బాణీ లు సమకూరుస్తున్నాడు. గుణ శేఖర్, రవితేజ మొట్ట మొదటి సారిగా కలిసి చేస్తున్న చిత్రం మరో విశేషం.

    English summary
    Raja Ravi Teja upcoming film Nippu is currently being filmed in Pollachi, Tamil Nadu state. The movie unit is canning a couple of songs and small talkie part in this schedule. The movie has started its regular shoot in the month of august and it has completed a schedule in and around Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X