‘పవర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి?
హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ నటించిన ‘పవర్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. సినిమా స్టోరీ రోటీన్ అయినప్పటికీ రవితేజ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మానందం కామెడీ ఎంటర్టెనింగుగా ఉండటంతో ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది. రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రానికి కలెక్షన్స్ బాగున్నాయి.
రవితేజ సినిమా కావడంతో ఈచిత్రంపై ముందు నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగినట్లుగానే సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా 900లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసారు. తొలి రోజు సినిమా విడుదలైన అన్ని చోట్లు 100 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. అయితే క్రిటిక్స్, సినిమా చూసిన వారి నుండి మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో శనివారం కాస్త బిజినెస్ తగ్గింది. అయితే సెలవుదినం కావడంతో ఆదివారం కాస్తపుంజుకుంది.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి వారాంతం(శుక్ర, శని, ఆది) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి రూ. 13.79 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ డే అయిన శుక్రవారం రూ. 5.14 కోట్లు వసూలవగా, శనివారం రూ. 4 కోట్లు, ఆదివారం రూ. 4.64 కోట్లు వసూలు చేసింది.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. థమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).


Click it and Unblock the Notifications











