రవితేజ 'పవర్' షెడ్యూల్ డిటేల్స్
హైదరాబాద్ : రవితేజ 'పవర్' చూపించడానికి దర్శకుడు కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ) అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. ఇటీవల ఈ మాస్ హీరోయిజంని టేస్ట్ చూపించటానికి పంచ్ డైలాగులతో టీజర్‌ని విడుదల చేశారు. ఇప్పుడు రవితేజ మార్కు స్టెప్పులతో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. రవితేజ, హన్సిక జంటగా రూపొందుతున్న చిత్రం 'పవర్'. చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.హీరో,హీరోయిన్స్ పై పాటని చిత్రీకరిస్తున్నారు. రాజుసుందరం నృత్యరీతులు సమకూరుస్తున్నారు.
ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై నాలుగు వరకూ హైదరబాద్ లో ఈ చిత్రం షెడ్యూల్ జరగింది. ఇంటర్వల్ మినహా ఫస్టాఫ్ టాకీతో పాటు రెండు పాటలను ఫినిష్ చేసారు. మార్చి మొదటి వారంలో కోలకతా షెడ్యూల్ మొదలు కానుంది. నెల రోజులు పాటు అక్కడ చిత్రంలో మేజర్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ తీస్తారు. ఆ తర్వాత అట్నుంచి అటే బ్యాంకాక్ వెళ్లి పాట,ఫైట్స్ తీస్తారు. మాస్ అంటే బస్‌పాస్ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకునే పిలుపు వంటి మాస్ డైలాగులతో ఈ చిత్రం రవితేజ కెరీర్ లో లాండ్ మార్క్ గా మిగులుతుందని అంటున్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ''బలుపు'తో మాస్ హీరోల్లో తనకు తిరుగులేదని రవితేజ మరోసారి రుజువు చేశారు. దాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్నిచ్చేందుకు ఈ చిత్రం వస్తోంది. మాస్ తరహా పోలీసుగా రవితేజ ఆకట్టుకుంటాడు''అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''పవర్ ఫుల్ పోలీస్ అధికారి కథ ఇది. ఈ టైటిల్ రవితేజకు నూటికి నూరుపాళ్లూ సరిపోతుంది. '' అన్నారు.
''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తున్నారు రవితేజ. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.
రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).


Click it and Unblock the Notifications











