»   »  రవితేజ ‘పవర్’ ఫస్ట్ లుక్, రెస్పాన్స్ కేక (ఫోటో)

రవితేజ ‘పవర్’ ఫస్ట్ లుక్, రెస్పాన్స్ కేక (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు రిపబ్లిక్ డే, అదే రోజు రవితేజ బర్త్ డే పురస్కరించుకుని ఆయన తాజా సినిమా 'పవర్' ఫస్ట్ లుక్ విడుదల చేసారు. మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్న రవితేజ ఈచిత్రంలో అందుకు ఏ మాత్రం తగ్గకుండా కనిపించడం, సినిమా టైటిల్ కూడా ఫుల్ మాస్‌గా ఉండటంతో రెస్పాన్స్ అదిరిపోతోంది.

ఇటీవలే 'బలుపు' చిత్రంతో మాస్ మసాలా హిట్ కొట్టిన రవితేజ ఈచిత్రంతో కూడా మరో విజయం అందుకోవడం ఖాయమని అంటున్నారు అభిమానులు. 'పవర్' మూవీ పోస్టర్ చూస్తుంటే ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ నుండి ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Ravi Teja’s Power​ first look

రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం:కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

English summary

 The first look of Ravi Teja-starrer Power has been released on the occasion of the actor's birthday. Directed by Bobby (KS Ravindranath), Power is tipped to be a mass entertainer that has Ravi Teja essaying the role of a cop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu