సెన్సేషన్ సృష్టిస్తున్న రవితేజ ‘పవర్’
హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'(అన్ లిమిటెడ్). ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్‌కు యూ ట్యూబులో రెండు రోజుల్లోనే 4,47,000 వ్యూస్ వచ్చాయి. రవితేజ గతంలో చేసిన 'బలుపు' చిత్రానికి ఒక సంవత్సరంలో 2,41,000 వ్యూస్ రాగా...'పవర్'కు రెండు రోజుల్లోనే అంతకు రెట్టింపు రావడం గమనార్హం.

ఈ సందర్భంగా దర్శకుడు కె.ఎస్.రవీందర్(బాబి) మాట్లాడుతూ మా 'పవర్' చిత్రానికి రెండు రోజుల్లోనే 4,47,000 వ్యూస్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. యూ ట్యూబులో వచ్చిన ఈ వ్యూస్ ద్వారా రవితేజగారు 'పవర్' సినిమా విడుదలకు ముందే తన పవర్ ఏమిటో చూపించారు. రవితేజగారి ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి హండ్రెడ్ పర్సంట్ సూట్ అయ్యే ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది' అన్నారు.
నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ 'తెలుగులో మొట్ట మొదటి సారి మా బేనర్లో చేస్తున్న 'పవర్' టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే తెలుగులో మా చిత్రం పెద్ద హిట్టవుతుందనే నమ్మకం మరింత పెరుగుతోంది అన్నారు.
రవితేజ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).


Click it and Unblock the Notifications











