విక్రమార్కుడి మార్కు(‘పవర్’ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : రవితేజ సినిమా వస్తోందంటే భాక్సాఫీస్ వద్ద హడావిడి ఓ స్ధాయిలో ఉంటుంది. ఎందుకంటే మహిళలు, పిల్లలుతో కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కు అతని సినిమాలు పెట్టింది పేరు. యాక్షన్ సినిమాలతో యువత లో కూడా అదే స్ధాయి క్రేజ్ ని సంపాదించుకున్న రవితేజ తాజా చిత్రంతో మరో సారి తన పవర్ ని చూపించటానికి సిద్దమవుతున్నారు. బలుపు విజయం తర్వాత వస్తున్న చిత్రం కావటం, బలుపుకి కథ అందించిన బాబి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ చిత్రం రూపొందించటం తో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

అతనో డాషింగ్ పోలీసాఫీసర్. దుష్టశిక్షణలో తనదైన మార్క్‌ను కనబరుస్తుంటాడు. ఏ అధికారానికి తలొగ్గక నిజాయితీగా పనిచేయడమే అతనికున్న పవర్. అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ దుర్మార్గుల ఆట కట్టించడానికి సరికొత్త పథకాన్ని రచిస్తాడు. అదేమిటో తెలుసుకోవాలంటే పవర్ చిత్రం చూడాల్సిందే. ఇందులో ఎసిపి బలదేవ్ సహాయ్ గా, తిరుపతి గా రెండు ఢిఫెరెంట్ రోల్స్ లో కనపిస్తాయి. ఆ రెండింటికి సంభందమేమిటన్నది ఇంటర్వెల్ ట్విస్ట్. ఫస్టాఫ్ పూర్తి ఫన్ తో సెకండాఫ్ యాక్షన్ తో చిత్రం సాగుతుంది. ముఖ్యంగా బ్రహ్మానందం, రవితేజ మద్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి. చిత్రంలో అస్ట్రాలజర్ నిరుపమ గా హన్సిక, ఆమె అసిస్టెంట్ గా సప్తగిరి కనిపించనున్నారు.

Ravi Teja's Power Telugu Movie Preview

దర్శకుడు మాట్లాడుతూ... పవర్‌ అంటే ఇంటికొచ్చే కరెంటు కాదు. బయట చేసే రాజకీయం కాదు. అది ఒంట్లో ఉండాలి.. అలాంటి హీరోని మా చిత్రంలో చూడొచ్చు .ఇందులో రవితేజ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుంది. ఆయన శైలి వినోదం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. యాక్షన్ ఘట్టాలు రొమాంచితంగా వుంటాయి. వినోదంతో పాటు మాస్ అంశాలు మేళవించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. రవితేజ కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన చిత్రమవుతుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''పవర్‌ ఫుల్‌ పోలీస్‌ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం ''అన్నారు.

బ్యానర్: రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: రవితేజ, హన్సిక, రెజీనా, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌రుషి, రావు రమేష్, సంపత్‌రాజ్, సుబ్బరాజు తదితరులు
కెమెరా: జయనన్ విన్సెంట్, మనోజ్‌పరమహంస,
మాటలు: కోన వెంకట్,
స్క్రీన్‌ప్లే: చక్రవర్తి, మోహనకృష్ణ,
ఆర్ట్: బ్రహ్మ కడలి,
ఫైట్స్: రామ్‌లక్ష్మణ్,
సంగీతం: తమన్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.బి.కృష్ణ,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి).
నిర్మాత :రాక్‌లైన్ వెంకటేష్
విడుదల తేదీ: 12, సెప్టెంబర్ 2014.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X