»   » రవితేజ 'రాజా ది గ్రేట్' హాలీవుడ్ సినిమాకి కాపీఅంటున్నారు: ఇంతకీ ఆ సినిమా పేరు తెలుసా?

రవితేజ 'రాజా ది గ్రేట్' హాలీవుడ్ సినిమాకి కాపీఅంటున్నారు: ఇంతకీ ఆ సినిమా పేరు తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ravi Teja's 'Raja the Great' First look Poster

టాలీవుడ్ లో మాస్ మహారాజగా పేరొందిన 'రవితేజ' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'బెంగాల్ టైగర్' సినిమా అనంతరం ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు.

సినిమాలకు దూరంగా ఉన్నాడు

సినిమాలకు దూరంగా ఉన్నాడు

కథలు నచ్చకపోవడం..ఇతరత్రా కారణాలతో 'రవితేజ' కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అనంతరం 'రాజా ది గ్రేట్'..'టచ్ చేసి చూడు' సినిమాలకు మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకుడిగా..దిల్ రాజు నిర్మాతగా 'రాజా ది గ్రేట్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో 'రవితేజ' అంధుడిగా నటించనున్నాడు. 'మెహరీన్' హీరోయిన్ గా నటిస్తోంది.

బ్లైండ్ ఫ్యూరీ'కి కాపీ ?

బ్లైండ్ ఫ్యూరీ'కి కాపీ ?

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ అంధుడిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇక బ్లైండ్ రోల్ లోనూ రవితేజ.. 'రాజా ది గ్రేట్' టీజర్‌లో తనదైన మాస్ మార్క్ ను చూపించాడు. అయితే.. టీజర్ విడుదలైన దగ్గరనుంచి ఈ సినిమా.. హాలీవుడ్ మూవీ 'బ్లైండ్ ఫ్యూరీ'కి కాపీ అనే ప్రచారం సాగుతోంది.

'బెంగాల్ టైగర్' తర్వాత

'బెంగాల్ టైగర్' తర్వాత

'బెంగాల్ టైగర్' తర్వాత సంవత్సరంన్నరగా సినిమాలు ఏమీ చేయకుండా కేవలం సబ్జెక్ట్స్ ఎన్నుకోవడానికే సమయాన్ని కేటాయించాడు రవితేజ. అలా మాస్ మహారాజ ఎంపిక చేసుకున్నవే 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' సినిమాలు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాల్లో ఇటీవలే 'రాజా ది గ్రేట్' టీజర్ విడుదలైంది.

'రాజా ది గ్రేట్' సినిమాలో కూడా

'రాజా ది గ్రేట్' సినిమాలో కూడా

1989లో హాలీవుడ్‌లో విడుదలైన 'బ్లైండ్ ప్యూరీ' సినిమాలో హీరో ఓ యుద్ధంలో తన కంటిచూపు పోగొట్టుకుంటాడు. కంటిచూపు పోయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధిస్తాడు. అలాగే.. 'రాజా ది గ్రేట్' సినిమాలో కూడా హీరో రవితేజ పుట్టకతో అంధుడు కాదని, పరిస్థితుల వలన గుడ్డివాడిగా మారుతాడనే టాక్ వినిపిస్తోంది.

కాపీ అనీ చెప్పలేం

కాపీ అనీ చెప్పలేం

అయితే ఈ ఒక్క పాయింట్ ని బట్టి కాపీ అనీ చెప్పలేం. బాలీవుడ్ లో లేటెస్ట్ గా వచ్చిన కాబిల్ నిర్మాణ సమయం లోనూ ఇలా బ్లైండ్ ప్యూరీ కాపీ అన్న టాక్ వచ్చింది కానీ సినిమా మాత్రం వేరుగా తీసారు. అయితే అది బాక్సాఫీస్ దగ్గర చతికిలబడటంతో మళ్ళీ పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు...ప్రస్తుతానికి రాజా ది గ్రేట్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ లో చిత్ర షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు.

English summary
A new rumour is circulating on RaviTeja's New project Rja the Great is a copy version of a Hollywood Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu