twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ కోసం దిల్ రాజు బోల్డ్ డిసిషన్.. క్యా సీన్స్ హై?..

    మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ రాజా ది గ్రేట్‌.

    By Rajababu
    |

    Recommended Video

    రవితేజ కోసం దిల్ రాజు బోల్డ్ డిసిషన్

    మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ రాజా ది గ్రేట్‌. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ప‌టాస్‌, సుప్రీమ్ వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో స‌క్సెస్‌ను అందుకున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.. అదేమిటంటే..

     నైజాంలో 10 కోట్ల షేర్

    నైజాంలో 10 కోట్ల షేర్

    అక్టోబ‌ర్ 18న విడుద‌లైన రాజా ది గ్రేట్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. భ‌ద్ర త‌ర్వాత ర‌వితేజ‌, దిల్‌రాజు క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు ధీటుగా రాజా ది గ్రేట్ సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌తో స‌త్తా చాటింది. కేవలం నైజాంలోనే 10 కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది.

    అంధుడి పాత్ర‌లో రవితేజ

    అంధుడి పాత్ర‌లో రవితేజ

    టాలీవుడ్‌లో ముందెన్నడూ లేని విధంగా ఓ మాస్ హీరో పూర్తిస్థాయి అంధుడి పాత్ర‌లో న‌టించ‌డం ఇదే మొదటిసారి. అంధుడిపాత్రలో ర‌వితేజ చక్కగా ఒదిగిపోయాడు. క‌థ‌, కథనం, పాత్ర, ద‌ర్శ‌క నిర్మాత‌లపై న‌మ్మ‌కంతో ఈ సినిమాలో న‌టించారు. రవితేజ పాత్ర‌లో ఒదిగిపోయి, న‌టించిన తీరు అద్భుత‌మని..ర‌వితేజ ది గ్రేట్ అని ప్రేక్ష‌కులు అంటున్నారు.

     కామెడీ సీన్లు సూపర్బ్

    కామెడీ సీన్లు సూపర్బ్

    ‘అరే బుజ్జి ఇప్పడు వారి ముఖ చిత్రం ఏమిటీ'.. ‘హు హు హు.. కూల్ కూల్', ఇంకా సరస్వతి పాత్ర వేసే పంచులు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది.

     శనివారం నుంచి మూడు సీన్లు

    శనివారం నుంచి మూడు సీన్లు

    తొలి ఆట నుంచి బ్రహ్మాండమైన టాక్‌తో రాజా ది గ్రేట్ దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ప్రేక్ష‌కుల‌కు మరింత వినోదాన్ని అందించ‌డానికి నిర్మాత దిల్‌రాజు ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. నిడివి ఎక్కువగా ఉందనే కారణంతో ఎడిటింగ్‌లో తీసేసిన మూడు కామెడీ సీన్స్‌ను ఈ చిత్రంలో శనివారం నుంచి అదనంగా చేర్చనున్నారు. ఇప్పటికే వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులకు మరింత నవ్వుల్లో ముంచడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Tollywood's Mass Maharaj Raviteja latest movie Raja the great going with superb collections. This movie got 10 crores share in Nizam itself. Huge response from public, The producer Dil Raju wanted to add three more comedy scenes to the movie. From saturday, three scenes are going to Raja the great.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X