రవి తేజ రాజా ది గ్రేట్ పోస్టర్: వెరైటీగా ఉంది
రవి తేజ రాజా ది గ్రేట్ కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
గత కొంత కాలం నుంచీ రవితేజా విపరీతమైన గ్యాప్ లో ఉన్నాడు. అనుకున్న ఒక్క సినిమాకూడా పట్టాలమీదకెక్కలేదు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు సమర్ఫణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మెహరీన్ కథానాయిక. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు శనివారం ప్రకటించారు.ఈ సినిమాలో 'రవితేజ' అంధుడిగా నటించనున్నాడు. మాస్ మహారాజా రవితేజను మునుపెన్నడూ లేనివిధంగా చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

ఇందులో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మరోపక్క రవితేజ టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. విక్రమ్ సిరికొండ దర్శకుడు.


Click it and Unblock the Notifications











