రవితేజ హీరోగా దిల్ రాజు మూవీ: ‘రాజా ది గ్రేట్’ (ప్రీ లుక్ పోస్టర్)
‘రాజా ది గ్రేట్’ చిత్రం ప్రారంభోత్సవం రేపు (ఫిబ్రవరి 6) హైదరాబాద్ లో జరుగబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు సమర్ఫణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఎట్టకేలకు అపీషియల్ న్యూస్ వెలువడింది. 'రాజా ది గ్రేట్' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నారు.
'రాజా ది గ్రేట్' చిత్రం ప్రారంభోత్సవం రేపు (ఫిబ్రవరి 6) హైదరాబాద్ లో జరుగబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు సమర్ఫణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా అన్ని విషయాలు వెల్లడించనున్నారు.

గత సంవత్సరం అసలు సినిమాలేవీ చేయకుండా గ్యాప్ తీసుకున్న రవితేజ ఇపుడు వరుస సినిమాలకు కమిట్ అవుతుండటం విశేషం. ఏది ఏమైనా రవితేజ వరుస సినిమాలకు కమిట్ అవ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ నిర్మిస్తున్న 'టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు.


Click it and Unblock the Notifications











