నిన్నటినుంచి వికారబాద్ అడవుల్లో రవితేజ
నిన్నటి(ఆదివారం)నుంచి వికారాబాద్ అడవుల్లో వారం రోజుల పాటు హీరో రవితేజ,విలన్ ప్రదీప్ రావత్, ప్రధాన తారాగణం పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ సారథ్యంలో భారీ ఎత్తున క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం.
ఈ క్లైమాక్స్ కోసం భారీ సెట్ నిర్మించాం.ఈ షెడ్యూల్‌తో మూడు పాటలు మినహా షూటింగ్ అయిపోతుంది అంటున్నారు రమేష్ వర్మ. రవితేజ తో వీర చిత్రాన్ని రూపొందిస్తున్న రమేష్ వర్మ చిత్ర విశేషాలను మీడియాకు తెలియచేసారు.రవితేజ హీరోగా కాజల్అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేశ్ ఇందుకూరి నిర్మిస్తోన్న చిత్రం 'వీర'. రమేశ్‌వర్మ దర్శకుడు.
'కిక్' శ్యామ్, శ్రీదేవి,నాగబాబు,రోజా, కృష్ణుడు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, హేమ, దివ్యవాణి, సుప్రీత్, సుబ్బరాజు, అజయ్ తారాగణమైన ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: నారాయణరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేశ్‌వర్మ.


Click it and Unblock the Notifications











