రవితేజకు సైన్ చేసిన కాజల్, 16 నుంచి షూటింగ్
రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సార్ వస్తారు' చిత్రానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈచిత్రం టైటిల్‌ను తాజాగా 'సార్ వచ్చారు'గా మార్చారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌తో పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా ఈచిత్రానికి కాజల్ ఖరారైంది. ఈ మేరకు ఆమె సినిమా అగ్రిమెంటుపై సైన్ కూడా చేసింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో ఈచిత్రానికి త్రిష, అమల పాల్, పరూల యాదవ్‌లను అనుకున్నప్పటికీ చివరకు కాజల్ ఖరారైంది. ప్రస్తుతం ఈచిత్రం ప్రిప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. జూన్ 16 నుంచి ఊటీలో తొలి షెడ్యూల్ ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ప్రస్తుతం కాజల్...చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె మహేష్ బాబు-సుకుమార్ చిత్రానికి డేట్స్ ఇచ్చింది. అంతే కాకుండా రామ్ చరణ్-వివి వినాయక్ చిత్రంలో కూడా హీరోయిన్‌గా ఎంపికయింది. జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రంలోనూ కాజలే హీరోయిన్.
రవితేజ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటిస్తున్నాడు. దొంగల ముఠా, వీర, నిప్పు వరుస ప్లాపులతో కొనసాగుతున్న రవితేజకు ఇటీవల విడుదలై 'దరువు' చిత్రం కూడా అనుకున్న అంచనాలను అందుకోలేక పోయింది.


Click it and Unblock the Notifications











