పవన్ కళ్యాణ్ ప్లేస్‌లోకి రవితేజ వచ్చాడా..!
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడంటూ చాలా కాలం పాటు వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీకావడంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం తేరి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కథలో కీలక మార్పులు చేసి పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా సంతోష్ శ్రీనివాస్ కథ సిద్ధం చేశారు.
పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకోవడంతో సంతోష్ శ్రీనివాస్ రవితేజతో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. తమిళ కథలోని పాయింట్ ని తీసుకున్న సంతోష్ శ్రీనివాస్ దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలిచారు. జులై నుంచి ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రంలో రవితేజ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. కాజల్ ఇదివరకే రవితేజతో రెండు చిత్రాల్లో నటించింది. వీర, సారొచ్చారు చిత్రాల్లో కాజల్, రవితేజ జంటగా నటించారు. కేథరిన్ మరో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications










