twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘సారొచ్చారు’ ఆడియో ఈ నెల 30న

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాస్ మహరాజ రవితేజ హీరోగా రూపొందుతున్న 'సారొచ్చారు' చిత్రం ఆడియో విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 30న ఈచిత్రం ఆడియో హైదరాబాద్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

    ఇది వరకు రవితేజ-దేవిశ్రీ కాంబినేషన్లో ఖడ్గం, వెంకీ, భద్ర లాంటి మ్యూజకల్ హిట్స్ వచ్చాయి. ఇటీవల రింగ రింగ, కెవ్వు కేక లాంటి హాట్ ఐటం నెంబర్లు కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్...'సారొచ్చారు' చిత్రం కోసం 'రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేసారు.

    పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు. డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్. మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్‌ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    English summary
    Mass Maharaja Ravi Teja’s ‘Sarocharu’ audio launch will be held on November 30. Devi Sri Prasad has scored the film’s music. Kajal Aggarwal and Richa Gangopadhyay are the heroines in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X