రవితేజ ‘సారొచ్చారు’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్ : మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'సారొచ్చారు' సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం డిసెంబర్ 21న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లు.
ఈచిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఊటీ, యూరఫ్, హైదరాబాద్ లలో నిర్వహించారు. దర్శకుడు పరశురామ్ ఈచిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ్ మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి.
గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాత అశ్వినీదత్. ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై.లి.పై నిర్మిస్తున్నారు.
చాలా కాలంగా రవితేజకు సరైన హిట్ లేదు. ఈ సంవత్సరం రవితేజ నటించిన వీరా, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు వరుసగా ఫెల్యూర్ అయ్యాయి. అయితే ఈ చిత్రం మాత్రం తనకు మళ్లీ బ్రేక్ ఇస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అటు దర్శక నిర్మాతలు కూడా విజయంపై నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలిలేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











