Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రవితేజ 'సారొచ్చారు' ఫస్ట్ లుక్ ఇదే
హైదరాబాద్ : రవితేజ, కాజల్ కాంబినేషన్ లో 'సార్ వస్తారు' టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరుసరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మీడియాకు విడుదల చేసారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. రవితేజ తరహా కామిక్ టచ్ తో,యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెప్తున్నారు. గతంలో పరుసరామ్,రవితేజ కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నారా రోహిత్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ పాత్ర కథను కీలకమైన మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గతంలో పరుసరామ్,నారా రోహిత్ కాంబినేషన్ లో సోలో అనే చిత్రం రూపొందింది. ఈ అనుబంధంతో ఈ ప్రత్యేక పాత్రకు నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నిమిత్తం రవితేజ రెమ్యునేషన్ తీసుకోకుండా కేవలం షేర్ మాత్రం తీసుకునేటట్లు ఎగ్రీ అయ్య శక్తి ప్లాప్ తో లాస్ లో ఉన్న నిర్మాతకు భారం తగ్గించాడని తెలుస్తోంది.
అలాగే దర్శకుడు పరుశరామ్ కి సైతం రెమ్యునేషన్ ని సినిమా పూర్తయ్యి అమ్ముడయ్యాక తీసుకునేడట్లు ఎగ్రిమెంట్ చేయించాడని చెప్పుకుంటున్నారు. అలా ఓ పెద్ద నిర్మాతను రవితేజ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా నటించనున్నారు. ఇటీవలే ఊటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.
మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్ శ్రీను చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరి పివిపి సినిమా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించన్నారు.