రవితేజ ‘సార్ వచ్చారు’ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్: 'వీర' చిత్రం తర్వాత రవితేజ-కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'సారోచ్చారు'. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వైజయంతిమూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ఖరారైంది.
డిసెంబర్ 21న ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఆడియో విడుదల కానుంది. ఈ సంవత్సరం రవితేజ నటించిన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు చిత్రాలు విడుదలయ్యాయి. 'సారోచ్చారు' ఈ సంవత్సరం విడుదలవుతున్న రవితేజ నాలుగో సినిమా.
గతంలో రింగ రింగ, కెవ్వు కేక లాంటి హాట్ ఐటం నెంబర్లు కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్...'సారోచ్చారు' చిత్రం కోసం 'రచ్చ రంబోలా' అనే మసాలా సాంగును కంపోజ్ చేస్తున్నారు. ఈచిత్రంలో రవితేజ సరసన కాజల్, రిచా గంగోపాధ్యయ్ హీరోయిన్లుగా చేసారు.
గతంలో రవితేజ-పరశురామ్ కాంబినేషన్లో 'ఆంజనేయులు' అనే ప్లాపు మూవీ వచ్చినప్పటికీ ఈ సారి మాత్రం సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు అశ్వినీదత్. మరో వైపు రవితేజ 'బలుపు' అనే చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మినిమమ్ హిట్ గ్యారంటీ హీరోగా ఉన్న రవితేజను ఈ మధ్య వరుసగా ప్లాపులు పలకరిస్తున్నాయి. రవితేజ నటించిన వీర, నిప్పు, దొంగల ముఠా, దరువు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. తాజాగా రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.


Click it and Unblock the Notifications











