రొమాన్స్ తో రచ్చ ( సారొచ్చారు ప్రివ్యూ)
హైదరాబాద్ : రవితేజ తాజా చిత్రం 'సారొచ్చారు'. దీనికి 'మంచి ప్రేమకథతో..' ఉపశీర్షిక. కాజల్, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి సమర్పణలో త్రీ ఏంజెల్స్ స్టూడియో పతాకంపై సి.అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు విడుదలకు సన్నద్ధమవుతోంది.
రవితేజ ఊటీలోని లారెన్స్ హైస్కూల్లో పిల్లలకు ఫుట్‌బాల్ కోచ్‌గానూ, అదే సమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానూ కనిపిస్తారు. మాస్ మహారాజా ఆ పాత్రని తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకునే రీతిలో చేశారు. ఆయన కామిక్ టైమింగ్ తెలిసిందే. దాన్నే చాలా సెటిల్డ్‌గా చేశారు. కాజల్ అగర్వాల్ ఆశ్చర్యకరమైన పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన ఆమె ఈ సినిమాలో అభినయానికి అవకాశమున్న పాత్రలో చాలా బాగా చేసింది. రిచా గంగోపాధ్యాయ్ హోమ్లీగా, గ్లామరస్‌గా ఉండే పాత్రలో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకో ప్రత్యేకాకర్షణ ఇదే బ్యానర్ ద్వారా హీరోగా పరిచయమైన నారా రోహిత్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం. కథలో ఆయనదీ కీలక పాత్ర. క్లైమాక్స్‌లో రోహిత్ బాగా ఆకట్టుకుంటారు.
చిత్రం గురించి నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ.... 'ఇది అసాధారణ చిత్రం' అని చెప్పను. కానీ చూసిన ప్రతి ఒక్కర్నీ సంతృప్తిపరిచే చిత్రం. మా బేనర్‌కు తప్పకుండా ఫ్రెష్‌లుక్ తెచ్చే సినిమా అన్నారు."ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం స్క్రిప్టే. వెరీ సర్‌ప్రైజింగ్ ఛార్మింగ్ స్క్రిప్ట్. వినగానే 'అరే భలే ఉందే' అనిపించింది. చూసిన వాళ్లకీ అలాగే అనిపిస్తుంది'' అని చెప్పారు నిర్మాత ప్రియాంక దత్.
బ్యానర్ : త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై.లి.పై
సమర్పణ : వైజయంతి మూవీస్
నటీనటులు: రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్, రవిప్రకాష్, యం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు
ఛాయాగ్రహణం: విజయ్ కె.చక్రవర్తి,
ఫైట్స్: రామ్, లక్ష్మణ్.
సంగీతం : దేవిశ్రీప్రసాద్
కథ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం : పరుశరామ్
నిర్మాత: ప్రియాంక దత్


Click it and Unblock the Notifications











