twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెల్లంకొండ సురేష్‌ కి బస్తాలకొద్దీ డబ్బు...

    By Srikanya
    |

    తాను నటిస్తున్న 'శంభో శివ శంభో' హిట్టై నిర్మాత బెల్లంకొండ సురేష్‌కి బస్తాలకొద్దీ డబ్బును తీసుకురావాలి' అంటూ ఆకాంక్షించారు అల్లరి నరేష్‌. రవితేజ, నరేష్‌, శివబాలాజీ హీరోలుగా శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' చిత్రం ఆడియో కార్యక్రమం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగింది. హీరో గోపీచంద్‌ ఆడియోను ఆవిష్కరించి రవితేజకు అందించారు.ఈ సందర్బంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్‌ అంతా సరదా సరదాగా సాగిపోయింది. ఈ చిత్రనిర్మాణంలో దర్శకుడు సముద్రఖని నాకు మంచి మిత్రుడయ్యారు. తెలుగులో కూడా సినిమా విజయం సాధిస్తుంది' అన్నారు హీరో రవితేజ.

    గోపీచంద్‌ మాట్లాడుతూ 'ట్రైలర్స్‌ అదిరిపోయాయి. ఈ సినిమా తమిళ వెర్షన్‌ చూశాను. మనసుకు హత్తుకునే సినిమా. తెలుగులో కూడా బాగా వచ్చిందని ట్రైలర్స్‌ చూస్తే అర్థమయింది. ఇక్కడ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 'మంచి టీమ్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తమిళంలో విజయవంతమైన 'నాడోడిగళ్‌' చిత్రం ఈ సినిమాకు ఆధారం. దర్శకుడు సముద్రఖని సినిమాను బాగా తీశారు. తెలుగులో కూడా విజయవంతమై నిర్మాత సురేష్‌గారికి బస్తాలకొద్దీ డబ్బును తీసుకురావాలి' అన్నారు.

    చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ 'శంభో శివ శంభో' పూర్తి కమర్షియల్‌ చిత్రం. స్నేహం విలువని వివరించే సినిమా. సముద్రఖని సినిమాని అద్భుతంగా తీశారు. నాకు ఇంకో సినిమా చేసిపెట్టమని అడిగాను. ఈ చిత్రం తొలి కాపీ నాలుగు రోజుల్లో వస్తుంది. సంక్రాంతి సందర్బంగా ఈ నెల 14న సినిమాని విడుదల చేస్తాం' అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X