మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్: రవితేజ

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ 'శివ సెన్సిబుల్ డైరెక్టర్. అతనికి మాస్ పల్స్ బాగా తెలుసు. అతను చెప్పిన కథ ఎంతో ఇన్ స్పైరింగ్ గా వుంది. బూరుగపల్లి శివరామకృష్ణగారి బేనర్ లో ఓ మంచి ఎంటర్ టైనర్ ను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది" అన్నారు.
దర్శకుడు శివ మాట్లాడుతూ: 'రవితేజ ఇప్పటి వరకు చెయ్యని క్యారెక్టర్ ఇది ఎంటర్ టైన్ మెంట్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తున్న ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. మంచి మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. రవితేజ బూరుగపల్లి శివరామకృష్ణలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.
నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్న మాట్లాడుతూ 'మంచి ఎనర్జీ వున్న హీరో రవితేజ అంటే నాకు చాలా ఇష్టం. రవితేజ మా బేనర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నాడు. దర్శకుడు శివ మా సొంత డైరెక్టర్ లా మాలో కలిసిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మంచి సినిమా ఇది అన్నారు. రవితేజ, డా రాజేంద్రప్రసాద్, డా బ్రహ్మానందం, అలీ ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, షాయాజీ షిండే, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: శివ, ఆదినారాయణ. మరి ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.. తదిత విషయాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











