»   » రవితేజ షాకింగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ అదుర్స్....

రవితేజ షాకింగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ అదుర్స్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పుడో 'ఇడియట్" అయిపోయిన రవితేజకి 'మిరపకాయ్" అనే టైటిల్ మ్యాటరే కాదు. ఎప్పట్నుంచో ప్రచారంలో వున్న ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా పరిచయమూ అక్కర్లేదు. మరింతకీ ఇదెలా షాకింగ్ ప్రాజెక్ట్ అయిందీ అంటే..హిట్టిచ్చిన డైరెక్టర్ కే తర్వాత సినిమా సెట్ అవ్వని ప్రస్తుత పరిస్థితుల్లో రవితేజ హీరోగా 'షాక్" లాంటి డిజాస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ మళ్ళీ అదే రవితేజని ఒప్పించి తనతోనే 'మిరపకాయ్" తీస్తూ దీన్ని ఓ షాకింగ్ ప్రాజెక్ట్ గా మార్చాడని అనాలి.

మరింతకీ అంత నమ్మకంతో తనకు మరో సినిమా ఇచ్చిన రవితేజకి ఈసారైనా హరీష్ శంకర్ హిట్టిస్తాడో..లేక ఇంకో షాకిస్తాడో త్వరలో తేలనుంది. అయితే ఆంజనేయులు, శంభో శివ శంభో, డాన్ శీను చిత్రాల ఫలితాలతో 'కిక్" తగ్గిన రవితేజకి మాత్రం ఇప్పడో సక్సెస్ రావడం చాలా అవసరం. అలాగే 'లీడర్" తో కలిసొచ్చినా కలిసిరాని రిచా గంగోపాధ్యాయ్ కీ, వేదం వల్లించినా గుర్తింపు దక్కని దీక్షాసేత్ కీ కూడా 'మిరపకాయ్" ఫలితం పై చాలా ఆశలున్నాయండోయ్..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu