ఠాగూర్ హౌజ్‌లో మాస్ మహరాజ్ రవితేజ

By Bojja Kumar

హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఠాగూర్ హౌజ్‌లో జరుగుతోంది. గ్రాండ్ లుక్‌తో ఉన్న ఈ హౌజ్‌లో సినిమాకు సంబంధించిన కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు.

సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్నిజూన్ నెలాఖరు వరకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రవితేజ గత చిత్రం 'బలుపు' కూడా గతేడాది జూన్ నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే విడుదల విషయమై నిర్మాతల నుండి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Ravi Teja shoots in Tagore house

రవితేజ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X