ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్లతో.. బాగా ఎంజాయ్ చేశా.. రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్

ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి నిర్మాతగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెలకిషోర్, సునీల్, రాంకీ, సత్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా జనవరి 24న రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ..

బాగా ఎంజాయ్ చేశాను.. చేస్తారు..

బాగా ఎంజాయ్ చేశాను.. చేస్తారు..

చాలా రోజుల తర్వాత నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ నటించిన చిత్రం ఇది. మీరు కూడా థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంతగా ఎంజాయ్ చేయడానికి కారణం దర్శకుడు వీఐ ఆనంద్. చాలా రోజుల తర్వాత సునీల్‌తో కలిసి నటించాను. మా కాంబినేషన్ బాగా ఆకట్టుకొంటుందని నమ్ముతున్నాను. సెట్లో తోటి నటీనటులతో బాగా ఎంజాయ్ చేశాను. స్క్రీన్ మీద ఆ ఎనర్జీ కనిపిస్తుంది అని రవితేజ అన్నారు.

ముగ్గురి హీరోయిన్లతో

ముగ్గురి హీరోయిన్లతో

నా కెరీర్‌లో ఎప్పుడూ ఒకరో, ఇద్దరో హీరోయిన్లతో చేశాను. కానీ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించాను. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో నటించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ స్పెషాలిటీ ఏమిటో మీకు తెర మీద కనిపిస్తుంది. ఇక నభా నటేష్ గురించి చెప్పనక్కర్లేదు. మాస్ ఎలిమెంట్స్‌తో ఇరుగదీసింది అని రవితేజ తెలిపారు.

క్యారెక్టర్లను చూస్తూ పెరిగా

క్యారెక్టర్లను చూస్తూ పెరిగా

దర్శకుడు వీఐ ఆనంద్ చెప్పిన క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. కథ చెప్పేటప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. అలాంటి క్యారెక్టర్లన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. 70, 80 దశకంలో నేను చూసి ఇష్టపడిన క్యారెక్టర్‌లో నటించాను. అందుకే ఎక్కువ ఇన్‌వాల్వ్ అయ్యాను. డిస్కో రాజాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆర్ట్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణులు చాలా అవుట్‌పుట్ ఇచ్చారు అని రవితేజ్ పేర్కొన్నారు.

 మొదటి సినిమా నిరాశ పరిచింది..

మొదటి సినిమా నిరాశ పరిచింది..

దర్శకుడు రామ్ తాళ్లూరితో నాకు రెండో సినిమా. మొదటి సినిమా నేలటికెట్ మమ్మల్ని నిరాశపరిచింది. కానీ ఈ సినిమా మాకు మంచి విజయాన్ని అందించబోతున్నది. ఈ సినిమాను జనవరి 24వ తేదీన బ్రహ్మండంగా ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఫంక్షన్‌కు అతిథులుగా వచ్చిన అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేనికి థ్యాంక్స్ అని అన్నారు.

Recommended Video

'Disco Raja' Movie Team Interview Part - 1 || Ravi Teja || Payal Rajput || VI Anand ||
నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తన్యా హోప్, బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
దర్శకత్వం: వీఐ ఆనంద్
నిర్మాత: రజనీ తాళ్లూరి
బ్యానర్: ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్
సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్: నవీన్ నూలి
రిలీజ్ డేట్: 2020-01-24

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X