twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అట్టర్ ప్లాప్ స్టార్ డైరెక్టర్, ప్లాప్ స్టార్ హీరో.. ఏమవుతుందో ఏమో..!

    |

    ఒకప్పుడు శ్రీవైట్ల సినిమా అంటే అని వర్గాల ఆడియన్స్ ఎగబడి థియేటర్ లకు వెళ్లేవారు. కొన్నా టికెట్ కు కడుపుబ్బా నవ్వించి పంపుతాడనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. కానీ ఆగడు చిత్రం నుంచి శ్రీనువైట్ల కెరీర్లో తిరోగమనం మొదలైంది. గతంలో శ్రీనువైట్ల సినిమా అంటే ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు లేవు. ఈ నేపథ్యంలో శ్రీనువైట్ల తనకు ఆరంభంలో కలసి వచ్చిన హీరోనే మరో మారు నమ్ముకున్నాడు. అతడెవరో కాదు మాస్ మహా రాజా రవితేజనే. రవితేజ కూడా ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న సంగతి తెలియందే. ఈ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుండడంతో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడాలి.

    ప్లాప్ సినిమాతో ప్రయాణం మొదలు

    ప్లాప్ సినిమాతో ప్రయాణం మొదలు

    శ్రీనువైట్ల తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం నీకోసం. రవితేజ ఈ చిత్రంతోనే పూర్తి స్థాయి హీరోగా మారాడు. కానీ నీకోసం చిత్రం వీరిద్దరికి నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత వీళ్లిద్దరి కెరీర్లు ఊపందుకున్నాడు. రవితేజ ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. శ్రీనువైట్ల సొంతం,ఆనందం వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగాడు.

    ఈ సారి గురి తప్పలేదు

    ఈ సారి గురి తప్పలేదు

    నీకోసం వంటి ప్లాప్ మూవీ తరువాత శ్రీనువైట్ల మరియు రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం వెంకీ. ఈ పకడ్బందీ ప్లానింగ్ తో అదిరిపోయే హిట్టు కొట్టారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ని వెంకీ చిత్రం అలరించింది.

    దుబాయ్ శీనుతో మళ్లీ

    దుబాయ్ శీనుతో మళ్లీ

    వెంకీ చిత్రం తరువాత ఈ కాంబినేషన్ లో మరో చిత్రం దుబాయ్ శీను వచ్చింది. ఈ సినిమా కూడా కామెడీ పరంగా హిట్టైంది. రవితేజ, బ్రహ్మి, కృష్ణ భగవాన్ కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి.

    దూకుడుతో తిరుగులేని డైరెక్టర్ గా

    దూకుడుతో తిరుగులేని డైరెక్టర్ గా

    వరుస విజయాలు అందుకుంటున్న శ్రీనువైట్లకు మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. శ్రీనువైట్ల మహేష్ బాబుతో దూకుడు చిత్రం చేసారు. ఈ చిత్రంలో దర్శకుడు మహేష్ బాబు డైలాగ్ మాడ్యులేషన్ నే మార్చేశాడు. ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. దీనితో శ్రీనువైట్ల టాలీవుడ్ లో తిరుగులేని అవతరించాడు.

    ఆగడుతో మొదలైంది

    ఆగడుతో మొదలైంది

    శ్రీనువైట్ల ప్లాప్ జర్నీ ఆగడు చిత్రంతో మొదలైంది. రెండవ సారి మహేష్ బాబుతో చేసిన సినిమా ఇది. దూకుడు చిత్రం నుంచి శ్రీనువైట్ల అదే ఫార్ములాని ఉపయోగిస్తూ వచ్చాడు. ఆగడుతో జనాలు విసిగిపోవటంతో ఈ చిత్రం డిజాస్టర్ గా మారింది.

    బ్రూస్లీ, మిస్టర్.. అదే సీన్

    బ్రూస్లీ, మిస్టర్.. అదే సీన్

    ఆ తరువాత శ్రీనువైట్ల హీరోలని మార్చినా ఫలితం మాత్రం మారలేదు. రామ్ చరణ్ తో చేసిన బ్రూస్లీ చిత్రం, వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్ సినిమాలు ప్లాపయ్యాయి.

    అవకాశాలు కరువు

    అవకాశాలు కరువు

    వరుస డిజాస్టర్ లతో కుంగిపోయిన శ్రీనువైట్లతో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి తరుణంలో మిత్రుడిని ఆదుకోవడానికి రవితేజ ముందుకు వచ్చాడు. త్వరలో వీరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాబోతోంది.

    అద్భుతం ఏమైనా

    అద్భుతం ఏమైనా

    వాస్తవానికి రవితేజ కూడా ప్రస్తుతం ప్లాపుల్లోనే ఉన్నాడు. తాజాగా విడుదలైన టచ్ చేసి చూడు చిత్రం కూడా నిరాశ పరిచింది. ఈ మధ్యకాలంలో రవితేజ నుంచి వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం అంటే అది రాజా ది గ్రేట్ మాత్రమే. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అద్భుతం ఏమైనా చేస్తారేమో చూడాలి. శ్రీనువైట్ల తన పంథాని మార్చుకుని కొత్తగా ట్రై చేస్తే ఫలితం ఉంటుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు.

    English summary
    Ravi Teja and SrinuVaitla new movie will starts soon. Srinuvaitla and Ravi teja are teaming up for fourth time. These director and hero are now in plops.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X