‘ఓమైగాడ్’ రీమేక్‌లో రవితేజ

By Bojja Kumar

హైదరాబాద్ : పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'ఓ మై గాడ్'. ఈ చిత్రం అక్కడ మాంచి హిట్ అయింది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. మాస్ మహారాజ రవితేజ ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పోషించిన మోడ్రన్ కృష్ణుడి పాత్రను పోషించబోతున్నాడట. పరేశ్ రావల్ పాత్రకు సీనియర్ నరేష్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

టాలీవుడ్ నిర్మాత పరుచూరి వెంకటేశ్వరరావు హిందీ 'ఓ మై గాడ్' చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యాడని, ఆయన ప్రయత్నాలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో ఈ విషయమై ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ప్రస్తుతం రవితేజ 'బలుపు' చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం రూపొందుతోంది. రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత.

ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈచిత్రం 2013 మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X