సూర్య, రవితేజ కాంబినేష్ లో చిత్రం..డిటేల్స్
తెలుగు,తమిళ హారోలు కలిసి ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ స్టార్స్ మరెవరో కాదు సూర్య,రవితేజ. సూర్య నటించిన చిత్రాలన్నీ తెలుగులో డబ్బింగై హిట్ అవుతున్నాయి. అలాగే రవితేజ నటించిన చిత్రాలు తమిళంలోకి అనువాదం అవుతూ నిర్మాతలకు లాభాలను అందిస్తున్నాయి.దాంతో ఈ ఇద్దరూ కలసి నటిస్తే ఆ చిత్రానికి ఎంత క్రేజ్ ఉంటుందో అని ఆలోచనతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్విభాషా మల్టీస్టారర్ చిత్రానికి మంగాత్త(గాంబ్లర్) చిత్రంతో స్టార్ డెరైక్టర్ లిస్ట్ లో చేరిన వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర కథను వెంకట్ ప్రభు సూర్యకు చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రవితేజ కూడా ప్రాజెక్టు గురించి చెప్పగానే ఓకే చేసారు. ఇక ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు.ఇక మురుగదాస్, సూర్య కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం 'సెవెన్త్ సెన్స్'.ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.సూర్య, శృతిహాసన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ఏళామ్ అరివు"ని తెలుగులో 'సెవెన్త్ సెన్స్" పేరిట లక్ష్మీగణపతి ఫిలింస్ సుబ్రహ్మణ్యం విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











