Mr Bachchan First Review: రవితేజ సినిమా ఎలా ఉంది? మిస్టర్ బచ్చన్ హిట్ అయ్యేనా?

తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది హీరోలు చాలా కష్టాలను అనుభవించిన తర్వాత వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. చాలా కాలంగా తనదైన సినిమాలతో సందడి చేస్తోన్న అతడు.. ఇప్పుడు భారీ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇందుకోసం ఈ స్టార్ హీరో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాను చేశాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి సెన్సార్ రివ్యూ ఎలా ఇచ్చింది? ఇందులో హైలైట్స్ ఏంటి? అనేవి తెలుసుకుందాం పదండి!

మిస్టర్ బచ్చన్‌గా రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమానే 'మిస్టర్ బచ్చన్'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అలాగే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.

Ravi Teja Starrer Mr Bachchan Movie Censor Review and Run Time Details

ప్రమోషన్స్‌ ఫుల్ జోష్‌లో
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' మూవీని ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలనూ సైతం పూర్తి చేసింది. దీంతో కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హడావిడే కనిపిస్తోంది.

ఆ సర్టిఫికెట్‌ను ఇచ్చారు
మాస్ మహారాజా రవితేజ - స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్టర్ బచ్చన్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడింది. దీంతో ఇటీవలే ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులకు ప్రదర్శించారు. ఈ మూవీని వీక్షించిన తర్వాత దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

Ravi Teja Starrer Mr Bachchan Movie Censor Review and Run Time Details

మూవీ రన్ టైమ్ ఎంత?
రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన 'మిస్టర్ బచ్చన్' మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా తెలిశాయి. ఈ సమాచారం ప్రకారం.. ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల (158 నిమిషాలు) పాటు ఉండబోతుందని తెలిసింది. అంటే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా 'డబుల్ ఇస్మార్ట్' కంటే కూడా తక్కువే.

సెన్సార్ రివ్యూ ఏంటంటే
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు పాజిటివ్ టాక్ ఇచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉందని వాళ్లు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు ఎలా సక్సెస్ అయ్యాయో మూవీ కూడా అదే రీతిలో ఆకట్టుకునే ఛాన్స్ ఉందని చెప్పారట.

Ravi Teja Starrer Mr Bachchan Movie Censor Review and Run Time Details

సినిమాలో హైలైట్ ఇవే
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాలోని హైలైట్లు కూడా తాజాగా లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఇందులో రవితేజ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎలివేషన్స్ సీన్స్, హరీష్ శంకర్ మార్క్ పంచ్ డైలాగులు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ విజువల్స్ హైలైట్‌గా ఉంటాయట. అలాగే, హీరోయిన్‌తో రవితేజ కెమిస్ట్రీ అదుర్స్ అని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X