RAVANASURA Twitter Review: రావణాసురకు టాక్ అలా.. ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. ఇంతకీ మూవీ హిట్టేనా అంటే!
తెలుగులో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నాడు మాస్ మహారాజా రవితేజ. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో వచ్చిన అతడు.. ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో నటించాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'రావణాసుర' అనే సినిమాతో రవితేజ ఆడియెన్స్ ముందుకు వచ్చేశాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని.. ఇప్పుడు భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో 'రావణాసుర' ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి మరి!
రావణాసురుడిగా వచ్చిన స్టార్: రవితేజ హీరోగా.. సుధీర్ వర్మ తెరకెక్కించిన మూవీనే 'రావణాసుర'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ నెగెటివ్ రోల్ చేశాడు.

అలాంటి స్టోరీ... ట్విస్టులతోనే : ఓ సాదాసీదా క్రిమినల్ లాయర్.. క్రూరంగా మారి అమ్మాయిలను చంపుతుంటాడు. అసలు అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? దాని వెనుక ఎలాంటి ట్రాజెడీ ఉంది? అనే అంశాలతో 'రావణాసుర' మూవీని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాల్లో చూపించారు. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రిలీజ్ చేస్తున్నారు.
అక్కడ మొదలు.. తొలిసారిగా : క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రావణాసుర' మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది. ఇప్పటికే యూఎస్ సహా చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో తొలిసారిగా 6 గంటలకే షోను ప్రదర్శిస్తున్నారు. ఇక, ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు.
ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందటూ : రవితేజ నటించిన 'రావణాసుర' చిత్రాన్ని చూసిన ఓ నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో 'రావణాసుర మూవీలో ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. క్రైజ్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతంగా ఉంది. రవితేజ కొత్తగా కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒప్పుకున్నందుకు ఆయనను అభినందించాలి. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి' అని చెప్పాడు.
ఆకలి ఇప్పుడు తీర్చుకునేలా : మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన 'రావణాసుర' సినిమాను చూసిన మరో నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు. 'రావణాసుర మూవీ సెకెండాఫ్: సుధీర్ వర్మ లాస్ట్ మూవీ ఆకలిని ఇప్పుడు తీర్చుకునే టైం వచ్చింది. రవితేజ అన్న గతంలో ఎప్పుడూ చేయనంత సాలిడ్‌గా పెర్ఫార్మ్ చేశాడు' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో సినిమాపై అభిప్రాయాన్ని వెల్లడించాడు.
రవితేజ హ్యాట్రిక్ కొట్టేశాడని: 'రావణాసుర' సినిమాను వీక్షించిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్‌లో 'రావణాసుర బ్లాక్ బస్టర్ హిట్. ధమాకా నుంచి రవితేజ ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్లు కొట్టేశాడు. ఈ వీకెండ్‌లో కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ప్రత్యేకించి నెగెటివ్ రోల్‌లో టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్, ఫైట్స్, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.
రవితేజకు ఇంకో హిట్ అని : రవితేజ - సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన 'రావణాసుర' సినిమాను చూసి ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ మేరకు తన ఖాతాలో 'మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ వల్ల రావణాసుర ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సెకెండాఫ్ రావణాసుర క్యారెక్టర్ వల్ల అద్భుతంగా ఉంది. రవితేజకు మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చేసింది' అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
బాసింగాలు బద్దలే అంటూ: రవితేజ నటించిన 'రావణాసుర' సినిమాను చూసిన ఇంకొక నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు. ఇందులో 'రావణాసుర.. పక్కా మాస్ స్టఫ్. చాలా సంవత్సరాల తర్వాత మా రవితేజను ఇలా చూస్తుంటే మైండ్ పోతుంది. పిచ్చ పూనకాలు వస్తున్నాయి. కాసుకోండి బాక్సాఫీస్ బాసింగాలు బద్దలయ్యే సినిమాతో వచ్చాము. కొడుతున్నాం' అంటూ వివరించాడు.
రావణాసురల ఫైనల్ టాక్: రవితేజ 'రావణాసుర' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లను బట్టి చూస్తే దీనికి మొత్తంగా మంచి టాకే వచ్చింది. చాలా మంది ఈ సినిమా బాగుందనే చెప్తున్నారు. అయితే, సెకెండాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా లేదని, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ, రవితేజ తనదైన నటనతో ఆకట్టుకుని సినిమాను చక్కగా నడిపించాడని తెలిసింది.


Click it and Unblock the Notifications











