For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RT 71: Tiger Nageswara Rao బయోపిక్.. పాన్ ఇండియా హీరోగా మాస్ మహారాజా

  |

  మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటాడు. ఒక్కసారి షెడ్యూల్ డేట్ ఫిక్స్ అయ్యింది అంటే మళ్లీ ఆగకూడదు అంటూ వర్క్ చేస్తాడు. రవితేజ తో వర్క్ చేసే ప్రతి ఒక్క దర్శకుడు కూడా అంతే ఎనర్జీ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా సింగిల్ టేక్ లోనే అన్ని సీన్స్ ను పూర్తిచేసే విధంగా హార్డ్ వర్క్ చేస్తాడు. గతంలో అగ్ర దర్శకులు కూడా ఈ హీరోతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అని కూడా అన్నారు. సమయానికి అనుగుణంగా పని చేస్తూ నిర్మాతలను కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టని హీరోగా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నాడు. అందుకే రవితేజతో సినిమా చేయడానికి దాదాపు అందరు నిర్మాతలు కూడా ముందుకు వస్తూ ఉంటారు.

  మొత్తానికి క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా మళ్లీ అపజయాలు అందుకోకూడదు అని విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుత రోజుల్లో కమర్షియల్ సినిమాలు ఎంత చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు అని వీలైనంతవరకు కాస్త కొత్త ఫార్మాట్ చేయాలని చూస్తున్నాడు. అంతేకాకుండా చరిత్రాత్మక కథలకు అలాగే బయోపిక్స్ కూడా చేయడానికి రవితేజ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే కథను చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ నెల 5న రాబోతోంది.

  Ravi teja tiger nageswara rao official poster released and announcement

  అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ బయోపిక్ ను పాన్ ఇండిఉఆ ప్రాజెక్ట్ గా తెరపైకి తీసుకు రానున్నట్లు సమాచారం. అసలైతే ఈ కథను మొదట బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయాలని అనుకున్నారు. అప్పట్లో ఒక ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు గానీ రవితేజ ప్రాజెక్టు లోకి వచ్చాడు. నేడు సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్లో టైగర్ నాగేశ్వరరావు అడుగులు వేస్తూ ఉండగా వెనకాల పులి అడుగులు చూపించడం చాలా పవర్ఫుల్ గా అనిపించింది. 80ల కాలంలో స్టూవర్టుపురం గజదొంగ గా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు అప్పట్లో మోస్ట్ వాంటెడ్ దొంగగా రికార్డుల్లోకి ఎక్కాడు. అతనిలో అందరికీ నచ్చేది ఏమిటంటే.. ఉన్న వారి నుంచి దోచుకొని లేనివాడికి పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఎక్కువగా దొంగతనాలు చేసేవాడు అని ఇప్పటికి కూడా కథలు కథలుగా చెబుతూ ఉంటారు.

  అతన్ని ఎన్నోసార్లు అరెస్టు చేసినప్పటికీ కూడా పోలీసులు బోల్తా కొట్టించి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పవర్ ఫుల్ దొంగపై సినిమా తీయాలని చాలా కాలంగా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఫైనల్ గా యువ దర్శకుడు వంశీ ఈ బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు దొంగాట కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్ లో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం మొదట నాని, రానా దగ్గుబాటి, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరో లను కూడా సంప్రదించారు. కానీ వారితో వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా రవితేజ కొన్ని మార్పులు చేయమని చెప్పడం తో దర్శకుడు వంశీ మాస్ రాజాకు నచ్చినట్లుగా కథను సెట్ చేశాడు. దీంతో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టి సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

  English summary
  Ravi teja tiger nageswara rao official poster released and announcement
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X