»   »  వర్మ నిర్మాతగా రవితేజ దర్శకుడుగా...

వర్మ నిర్మాతగా రవితేజ దర్శకుడుగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ravi Teja
రవితేజ కెరీర్ ప్రారంభంలో అసెస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలసిందే. అలాగే వర్మ దగ్గర కూడా డైరకక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాడు. ఇక అతను అనుకోకుండా హీరో అయ్యాడు. భారీగా క్లిక్ అయ్యాడు. అయితే దర్శకత్వం మీద కోరక మాత్రం పోలేదు. అది ఇప్పుడు తీర్చుకోబోతున్నాడనే గుసగుసలు వినపడుతున్నాయి. అలాగే ఆ చిత్రాన్ని నిర్మించేది కూడా వర్మేనని చెప్పుకుంటున్నారు. టిడిపి నాయకుడు,పేరున్న వ్యక్తి పరిటాల రవి జీవిత గాధని అతనే తెరకెక్కించబోతున్నాడని విపడుతోంది. అలాగే మొదట పరిటాల సునీత ఆమె భర్త జీవిత చరిత్రను తెరకెక్కిద్దామని నిర్ణయించుకుందికాని..పలు కారణాలతో ఆమె విరమించుకుందిట.

అయితే వర్మ ఆమెను సంప్రదించి తన ఆలోచనలు చెప్పటంతో ఒప్పుకుందని చెప్తున్నారు. అయితే ఆయన వేర్వేరు ప్రాజెక్టులలో బిజీగా ఉండటంతో రవితేజని డైరక్ట్ చేయమని అడిగాడుట. అయితే రవి తేజ మాత్రం మాటివ్వలేదని తెలుస్తోంది. హ్యాపీగా వెళ్తున్న హీరో కెరీర్ ని ప్రక్కన పెట్టి ఈ కొత్త దర్శకత్వం భాధ్యత స్వీకరించటం అవసరమా అని డైలమోలో పడ్డారుట. ఏమో అతను గనుక చేసి హిట్టిస్తే ...తర్వాత కాలంతో తన సినిమాలను తనే డైరక్ట్ చేసుకోవచ్చు కదా.ఇక ఇవి ప్రక్కన పెడితే నేనింతే సినిమాలో అతను దర్శకుడుగా నటిస్తున్నాడు. పూరీ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X