లక్ష్మీరాయ్ మళ్ళీ పట్టింది
ఎప్పుడూ ఏదో ఒక రూమర్ తో వార్తల్లో నిలిచే లక్ష్మీరాయ్ తాజాగా రవితేజ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కృష్ణవంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక లక్ష్మీరాయ్ గతంలో గతంలో 'కాంచనమాల కేబుల్‌టీవీ', పౌర్ణమి అనే చిత్రాల్లో నటించింది. కానీ ఆమె ఇక్కడ వర్కవుట్ కాకపోవటంతో తమిళ, మలయాళ చిత్రాల వైపు దృష్టి సారించింది. ఇప్పుడు కృష్ణవంశీ ద్వారా తెలుగులో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోంది లక్ష్మీరాయ్. ఈ సినిమా వచ్చే నెల మొదటి వారం నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని తెలిసింది. ఇక ప్రస్తుతం రవితేజ ఆంజనేయులు చిత్రంలో చేస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'యువత' ఫేం పరశురామ్ దర్శకుడు. నటుడు గణేష్ బాబు ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు.


Click it and Unblock the Notifications











