నా లైఫ్‌లో జ‌రిగిన అద్భుతం మాస్ మ‌హారాజ్‌.... (‘టచ్ చేసి చూడు’ ప్రీ రిలీజ్)

By Bojja Kumar

Recommended Video

టచ్ చేసి చూడు ప్రీ రిలీజ్ ఈవెంట్

రవితేజ హీరోగా, రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించారు.

రవితేజ మాట్లాడుతూ...

రవితేజ మాట్లాడుతూ...

‘ఈ వేడుక సందర్భంగా నేను ముందుగా థాంక్స్ చెప్పాల్సింది ``జామ్ 8''కు.... వారిచ్చిన సౌండ్, మ్యూజిక్ సూపర్ గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు చాలా మంది టాప్ టెక్నీషియన్స్ పని చేశారు. మా రామ్ ల‌క్ష్మ‌ణ్‌ లతో కేవలం ఒకటే ఫైట్ చేయడం కుదిరింది. ఈ సినిమాలో అన్భు అరివు, పీటర్ హెయిన్ కూడా ఫైట్స్ కంపోజ్ చేశారు. ఒక్కో ఫైట్ ఒక్కోక్కరు చేశారు. అదే విధంగా వెంక‌ట్, ర‌వివ‌ర్మన్ బాగా పనపి చేశారు. రాశీ ఖన్నా, సీర‌త్ క‌పూర్ ఎంత అందంగా ఉంటారో, అంతే అంద‌మైన న‌డ‌వ‌డిక ఉన్నవారు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ణు సాధించి నా నిర్మాత‌లు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేనిల‌కు బాగా డ‌బ్బులు రావాలి. మిర‌ప‌ర‌కాయ్ నుండి విక్ర‌మ్‌తో నాకు మంచి ప‌రిచ‌యం ఉంది. మంచి క్లారిటీ ఉన్న డైరెక్ట‌ర్‌. సినిమాను అద్భుతంగా తీశాడు. వ‌క్కంతం చాలా మంచి క‌థ‌ను అందించాడు. ఈ సినిమాతో మ‌న‌కు మంచి డైరెక్ట‌ర్ రాబోతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ అంతా విక్ర‌మ్‌దే'' అన్నారు.

 ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ మాట్లాడుతూ

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ మాట్లాడుతూ

``వినాయ‌క్‌గారు నాకు ఫిల్మ్ గురు. చాలా మంచి విష‌యాల‌ను ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీగారికి థాంక్స్‌. వ‌క్కంతం వంశీ అద్భుతమైన క‌థ‌ను అందించారు. సంగీతం అందించిన జామ్ 8, నేప‌థ్య సంగీతం అందించిన మ‌ణిశర్మ‌గారికి థాంక్స్‌. ఛోటాగారు న‌న్నెంతో ఇన్‌స్పైర్ చేశారు. డాలీ, హ‌రీష్‌ల‌కు థాంక్స్‌. రాశి, సీర‌త్‌లు గ్లామ‌ర్‌తోనే కాదు, న‌ట‌న‌తో కూడా మెప్పించారు.'' అన్నారు.

నా లైఫ్‌లో జ‌రిగిన అద్భుతం మాస్ మ‌హారాజ్‌

నా లైఫ్‌లో జ‌రిగిన అద్భుతం మాస్ మ‌హారాజ్‌

‘‘ఎన‌ర్జీని ఆయ‌న త‌న నుండి మ‌రొక‌రికి కూడా ఇచ్చే వ్య‌క్తి ర‌వితేజ‌గారు. మ‌నిషి లైఫ్‌లో అద్భుతాలు జ‌రుగుతుంటాయి. నా లైఫ్‌లో జ‌రిగిన అద్భుతం మాస్ మ‌హారాజ్‌. అలాంటి హీరోతో నేను డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం కావ‌డం నా అదృష్టం. ఈ టైటిల్‌లో ఎలాంటి ప‌వ‌ర్ ఉంటుందో, సినిమాలో కూడా అంతే ప‌వ‌ర్ ఉంటుంది. మీరు డిస‌ప్పాయింట్ కారు. మంచి మెసేజ్ కూడా ఉంది.'' అని దర్శకుడు విక్రమ్ సిరికొండ తెలిపారు.

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ

``విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు కావాల‌ని నేను ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా `షాక్‌` త‌ర్వాత నాకు బుజ్జిగారి ఆఫీస్‌లో విక్ర‌మ్ ప‌రిచ‌య‌మ‌య్యారు. విక్ర‌మ్ మా అంద‌రి కంటే పెద్ద హిట్ కొడ‌తాడు. మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో పెద్ద డైర‌క్ట‌ర్ అవుతారు. బుజ్జిగారితో మా ప‌రిచ‌యం చాలా గొప్ప‌ది. హాస్ట‌ల్ వార్డ‌న్‌లాగా చూసుకునేవారు. భోజ‌నం తిన‌మ‌ని, సినిమాలు చూడ‌మ‌ని అనేవారు. ఆయ‌న మీద ఏమైనా కోపం ఉంటే మేం వెళ్లి వినాయ‌క్‌గారికి చెప్పేవాళ్లం. ప్ర‌పంచం మ‌మ్మ‌ల్ని ప్రూవ్డ్ వ్య‌క్తులుగా చూడ‌క‌ముందే బుజ్జిగారు చూశారు. త్వ‌ర‌లో దీప‌క్‌ని కూడా డైర‌క్టర్ చేయాలి. న‌న్ను, మ‌లినేని గోపి, బోయ‌పాటి శ్రీను, హ‌రీశ్ శంక‌ర్‌, విక్ర‌మ్ సిరికొండ‌, బాబీ... ఇలా చాలా మందిని డైర‌క్ట‌ర్లుగా నిల‌బెట్టాడు. తొలి సినిమా చిన్న సినిమా చేసిన‌వారికి కూడా లైఫ్ ఇచ్చాడు. డైర‌క్ట‌ర్ల‌ను ర‌వితేజ న‌మ్మిన‌ట్టు ఇంకెవ‌రూ న‌మ్మ‌రు." అని హీరీష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X