పవన్ ‘తీన్ మార్’లాగే రవితేజాతో త్రిష ‘బమ్ చిక్ బమ్’
రవితేజ, త్రిష జంటగా 'బమ్ చిక్ బమ్' అనే చిత్రం నిర్మించబడుతోందని సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, అందాల త్రిష హీరోయిన్ గా 'బమ్ చిక్ బమ్" అనే చిత్రం యుటివి మూవీస్ వారు తెలుగు, తమిళ బాషలలో నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన 'బ్యాండ్ బాజా బారాత్' అనే చిత్రాన్ని తెలుగులో 'బమ్ చిక్ బమ్' పేరుతో రీమేక్ చేస్తున్నారట. బాలీవుడ్ లో 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రంలో రణవీర్ సింగ్ నటించిన పాత్రలో తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తూండగా, అనుష్క శర్మ నటించిన పాత్రలో తెలుగులో త్రిష హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం.
బాలీవుడ్ లో నిర్మించబడిన 'బ్యాండ్ బాజా బారాత్" చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా ప్రేక్షకాదరణ పోందింది. కాగా రవితేజ, త్రిష కాంబినేషన్ కృష్ణ లో ఇరగదీసిన ఈ జంట ఈ సారి ఎలా ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 'బ్యాండ్ బాజా బారాత్" చిత్రంలో కొన్ని లిప్ లాక్ సీన్లు యువతను ఆకట్టుకున్నాయి. మరి తెలుగులో ఈ 'బమ్ చిక్ బమ్" చిత్రంలో హీరో రవితేజతో హీరోయిన్ త్రిష లిప్ లాక్ సీన్లలో నటించటానికి అంగీకరిస్తుందా...? ఇటీవల విడుదలైన 'తీన్ మార్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ తో త్రిష లిప్ లాక్ సీన్లలో హ్యాపీగా నటించింది కనుక 'బమ్ చిక్ బమ్" చిత్రంలో కూడా రవితేజతో త్రిష లిప్ లాక్ సీన్లలో నటించేందుకు అంగీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పండితులంటున్నారు.


Click it and Unblock the Notifications











