For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హ్యాపీ బర్త్ డే రవితేజ (బలుపు ఫస్ట్ లుక్ పోస్టర్లు)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కష్టపడి పైకొచ్చిన అతి కొద్ది మందిలో ఒకరు రవితేజ. హీరోగా తానేంటో ఎప్పుడో నిరుపించుకున్నారు. వయసు 44 ఏళ్లయినా అది కనిపించకుండా కుర్ర హీరోలతో పోటీపడగల సత్తా అతడిది. రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ, అతని సినిమా అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుకే అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడతారు. అతడి సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ రాకపోవడానికి కూడా అదే కారణం.

  1968 జనవరి 26న జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన జన్మస్థలం. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన రవితేజకు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'సింధూరం' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తరువాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్లు ఇద్దరూ ఇష్ట పడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, భద్ర, విక్రమాక్కుడు, దుబాయ్ శ్రీను, కృష్ణ, కిక్, మిరపకాయ్ చిత్రాలతో రవితేజ స్టార్ హీరోగా మారిపోయారు.

  బలుపు ఫస్ట్ లుక్ పోస్టర్లు

  బలుపు ఫస్ట్ లుక్ పోస్టర్లు

  బలుపు ఫస్ట్ లుక్ పోస్టర్లు

  బలుపు ఫస్ట్ లుక్ పోస్టర్లు

  బలుపు ఫస్ట్ లుక్ పోస్టర్లు

  గత సంవత్సరం వరుస సినిమాలకు చేసిన రవితేజకు పెద్దగా కలిసి రాలేదు. అయితే సంవత్సరం మాత్రం తన దైన స్టయిల్ లో ఎంటర్ టైన్ చేస్తానంటున్నాడు రవితేజ. త్వరలో రవితేజ బలుపు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'బలుపు' ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. బలుపు సినిమా తర్వాత జింతాతా సినిమా చేయబోతున్నారు. రవితేజ మనల్ని ఇలాగే ఎంటర్ టైన్ చేస్తూ ఇలాగే మరిన్ని మంచి చిత్రాలను అందివ్వాలని కోరుకుందాం.

  బలుపు చిత్రం వివరాల్లోకి వెళితే...
  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం రూపొందుతోంది. రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈచిత్రం 2013 మే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

  English summary
  Mass Maharaja’ Ravi Teja's Balupu first look posters released. Ravi Teja turns 44 today. The energetic actor Born as Bhupatiraju Ravi Shankar Raju on January 26th 1968. Bhoopatiraju Raghunath Raju aka Raghu has also played the lead in a few B-Grade Telugu films and Bhoopathiraju Bharatraj Raju shared space with Ravi Teja in a few of his films and now plays negative roles in Tollywood. Before starting his career in Tollywood, Ravi Teja spent most of his childhood in Jaipur, Delhi, Mumbai and Bhopal. Later on he moved to Vijayawada along with his family and joined Siddhartha Degree College to pursue his Bachelors in Arts. Half way through his graduation, he left to Chennai on October 2nd 1988 to join Films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X