పవన్,ఎన్టీఆర్ లను అనుసరిస్తూ రవితేజ

By Srikanya

హైదరాబాద్ : వరసగా ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌, శింబు, ధనుష్‌... ఇలా హీరోలు గొంతు సవరించుకొని పాటలు పాడుతున్నారు. ఈ ట్రెండ్ ని కొనసాగిస్తూ... ఆ జాబితాలో ఇప్పుడు రవితేజ కూడా చేరారు. ఆయన హీరో గా నటిస్తున్న చిత్రం 'బలుపు'. ఈ సినిమా కోసం ఓ సరదా గీతాన్ని రవితేజ పాడారు.

ఈ విషయమై చిత్ర దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ '' హీరోయిన్ ను ఆటపట్టించే పాటలా వస్తుంది ఇది. ఆ పాటను రవితేజ గానం చేస్తేనే బాగుంటుందనిపించింది. ఆ మేరకు ఆయనతో మాట్లాడితే పాడేందుకు ఒప్పుకొన్నారు. సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పాడారు. తప్పకుండా ఆ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

'బలుపు' ఆడియోని వచ్చే నెల 1న హైదరాబాద్‌లో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌, అంజలి హీరోయిన్స్ గా నటించారు. లక్ష్మీరాయ్‌ ఓ ముఖ్య పాత్రలో మెరుస్తుంది.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X