మళ్లీ తెరపైకి రవితేజ ‘పవర్’

By Bojja Kumar

రవితేజ, మెహర్ రమేష్ కాంబినేషన్లో 'పవర్' సినిమా రూపొందుతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో ఆ సినిమా అటకెక్కినట్లు ప్రచారం జరిగింది. రవితేజగానీ, మెహర్ రమేష్ గానీ ఆ చిత్రం గురించి మాట్లాడటం మానేయడంతో ఇక 'పవర్' లేనట్లే అని అంతా భావించారు. తాజాగా రవితేజ బర్త్ డేను పురస్కరించుకుని వార్తా పత్రికల్లో 'పవర్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ యాడ్ ను ప్రచురించారు నిర్మాతలు. దీన్ని బట్టి సినిమా త్వరలోనే తెరకెక్కిస్తున్నామనే సంకేతాలు అభిమానుల్లోకి పంపారు. ఈ చిత్రాన్ని విజయప్రసాద్ ముళ్ల వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. వక్కతం వంశీ కథను అందించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ప్రస్తుతం రవితేజ గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' సినిమా చేస్తున్నారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం పిబ్రవరి 17న విడుదల కాబోతోంది. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటించనున్నాడు. మరో వైపు మెహర్ రమేష్ ప్రస్తుతం వెంకీ హీరోగా 'షాడో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత 'పవర్' ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X