Ravi Teja: టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ బడా సినిమాలకు పోటీగా..

డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్ లోని కోస్తా తీరంలో జరుగుతోంది. అయితే ఈ సినిమా నుండి తాజాగా వచ్చిన అప్డేట్ రవితేజ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

'టైగర్ నాగేశ్వరరావు' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల కానుంది 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ. అయితే ఈ మూవీ మరో రెండు పెద్ద సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది.

తమిళ్ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ - ఇళయదళపతి విజయ్ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ లియో కూడా అక్టోబర్ లోనే విడుదల కానుంది. విజయదశమి కానుకగా వస్తున్న ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు బోయపాటి- రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ కూడా అక్టోబర్ లోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.

Ravi teja upcoming movie tiger nageshwara rao release date update

రామ్ పోతినేని బోయపాటి కాంబోపై మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది ఈ సినిమా కూడా టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతున్న అక్టోబర్ 20వ తేదీనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇళయదళపతి మూవీ లియో, రామ్ పోతినేని సినిమా రెండింటిపైనా మంచి బజ్ ఉంది, భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటితో రవితేజ టైగర్ నాగేశ్వరరావు పోటీ పడి నిలదొక్కుకోవాల్సిందే.

ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. గజదొంగ అయినప్పటికీ స్థానికంగా నాగేశ్వర రావుకు మంచి పేరు ఉంది. టైగర్ నాగేశ్వరరావు రాబిన్ హుడ్ టైప్ అని అంటారు. అందుకే ఈ కథాంశాన్ని తీసుకుని మూవీ చేస్తున్నామని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X