వీరత్వమే విజయం...(రవితేజ వీర ప్రివ్యూ)
ఈ రోజు(శుక్రవారం) రవితేజ తాజా చిత్రం వీర విడుదల అవుతోంది.ఇందలో రవితేజ జనం కోసం బతికే మనిషి వీర వెంకట సత్యనారాయణగా కనిపించనున్నాడు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదు కానీ తనను నమ్ముకొన్న జనానికి మాత్రం ఏ హాని కలగకూడదన్నది ఆయన సిద్ధాంతం. ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటి? తను మనసుపడ్డ కబడ్డీచిట్టి (కాజల్) ఎవరు? వీరిద్దరి ప్రేమ ఫలించిందా లేదా? అలాగే రవేతేజ..దేవా అనే సెక్యూరిటీ గార్డు గా కూడా ద్విపాత్రల్లో కనపడతాడు. ఐకీ (తాప్సీ) సాప్ట్ వేర్ అమ్మాయి. దేవాకు, ఐకీ (తాప్సీ) అనే అమ్మాయికి మధ్య సంబంధం ఏమిటన్నది ప్రధానం. ఈ చిత్రం గురించి దర్శకుడు రమేష్‌వర్మ మాట్లాడుతూ ''ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో కూడిన చిత్రమిది. రవితేజ శైలి మాస్ అంశాలకు చోటుంది. కథ నేపథ్యం, రెండు కోణాల్లో కనిపించే రవితేజ పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఛోటా.కె.నాయుడు కెమెరా పనితనం, తమన్ సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయని అంటున్నారు. అలాగే ఈ చిత్రం రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు ప్రేరణతో కథ తయారుచేసామని చెప్తున్నారు.
సంస్థ: శాన్వి ప్రొడక్షన్స్
నటీనటులు: రవితేజ, కాజల్, తాప్సి, కిక్ శ్యామ్, శ్రీదేవి, నాగబాబు, కృష్ణుడు, నాజర్, రోజా, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: గణేష్ ఇందుకూరి
దర్శకత్వం: రమేష్ వర్మ


Click it and Unblock the Notifications











