రవితేజ లేటెస్ట్ రిలీజ్ వీర చిత్రం టాక్ ఏంటి
ఈ రోజు(శుక్రవారం) రవితేజ తాజా చిత్రం వీర విడుదల అవుతోంది. ఈ చిత్రంలో రవితేజ రెగ్యులర్ గా అందించే కామిడీ ధోరణికి భిన్నంగా వెళ్ళటం కొంచెం ఇబ్బందిగా ఉంటే అవకాశం ఉందంటున్నారు. అలాగే తెలుగులో వెరీ కామన్ గా వచ్చే రెగ్యులర్ మాస్ ఫిలిమ్స్ తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రాన్ని పూర్తిగా మలిచారు.అలాగే సెకెండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ వర్కవుట్ అయితేనే సినిమా నిలబడుతుందని అంటున్నారు. ఇక తాప్సీ అందాలు ఈ చిత్రంలో ఝమ్మందీనాదం తర్వాత పరిచింది. పూర్తిగా చేసిన ఎక్సపోజింగ్ ఓ వర్గానికి బాగా పడుతుందని ఆసిస్తున్నారు. బ్రహ్మానందం కామిడీ యావరేజ్ గా ఉందని టాక్. ఇక ఈ చిత్రంలో రవితేజ జనం కోసం బతికే మనిషి వీర వెంకట సత్యనారాయణ గా కనిపించనున్నాడు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదు కానీ తనను నమ్ముకొన్న జనానికి మాత్రం ఏ హాని కలగకూడదన్నది ఆయన సిద్ధాంతం.
ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటి? తను మనసుపడ్డ కబడ్డీచిట్టి (కాజల్) ఎవరు? వీరిద్దరి ప్రేమ ఫలించిందా లేదా? అలాగే రవేతేజ..దేవా అనే సెక్యూరిటీ గార్డు గా కూడా ద్విపాత్రల్లో కనపడతాడు.ఐకీ (తాప్సీ) సాప్ట్ వేర్ అమ్మాయి. దేవాకు, ఐకీ (తాప్సీ) అనే అమ్మాయికి మధ్య సంబంధం ఏమిటన్నది ప్రధానం. ఈ చిత్రం గురించి దర్శకుడు రమేష్‌వర్మ మాట్లాడుతూ ''ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో కూడిన చిత్రమిది. రవితేజ శైలి మాస్ అంశాలకు చోటుంది. కథ నేపథ్యం, రెండు కోణాల్లో కనిపించే రవితేజ పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఛోటా.కె.నాయుడు కెమెరా పనితనం, తమన్ సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయని అంటున్నారు. అలాగే ఈ చిత్రం రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు ప్రేరణతో కథ తయారుచేసామని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











