రవితేజ 'వీర' పాత్రకి స్ఫూర్తి రాజమౌళి చిత్రంలోని ఆ పాత్రే
"రవితేజ 'విక్రమార్కుడు'లో చేసిన ఫుల్ మాస్, యాక్షన్ రోల్ విక్రమ్ రాథోడ్‌ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. 'వీర'కి స్ఫూర్తి ఆ పాత్రే" అని చెప్పుకొచ్చారు దర్శకుడు రమేశ్‌వర్మ.రవితేజ హీరోగా శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేశ్ ఇందుకూరి నిర్మించిన 'వీర' చిత్రం ఈ నెల 20న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే...ఇందులో రవితేజ రెండు ఛాయలున్న పాత్ర చేశారు. ఒకటి సెక్యూరిటీ గార్డు దేవా, ఇంకొకటి ఊరికి రాబిన్‌హుడ్‌లాంటి వీర. ఇంట్లో మాత్రం వీర వెంకట సత్యనారాయణ. మామూలుగా ఎంత వినయంగా ఉంటాడో, తన వాళ్లకి ఏదైనా జరిగితే రాక్షసంగా మారిపోతాడు. అంటే ఇటు వినయం, అటు రాక్షసత్వం మేళవింపు 'వీర' పాత్ర. దీన్ని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా అన్నారు. ఈ చిత్రంలో రవితేజ పోషించే పాత్ర పేరు వీరవెంకటసత్యనారాయణ. వినయం, విధేయత కలిగిన ఓ యువకుడు రాక్షసుడుగా రౌద్రం దాల్చితే ఎలా ఉంటుందో చెప్పే చిత్రం 'వీర".ఇక సినిమా గురించి చెబుతూ...'వీర' పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్. సృజనాత్మక పరంగా చెప్పుకోవాల్సింది తక్కువైనా మంచి ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ఉన్న సినిమా. ఇందులో నేనేమీ ప్రయోగాలు చెయ్యలేదు. అయినా పాత్ర పరంగా రవితేజ కొత్తగా కనిపిస్తారు. 'విక్రమార్కుడు'లో ఆయన చేసిన ఫుల్ మాస్, యాక్షన్ రోల్ విక్రమ్ రాథోడ్‌ని ప్రేక్షకులు బాగా ఆదరించారు అన్నారు.


Click it and Unblock the Notifications











