ఒక్క రోజు ఆలస్యం అయినా విర్రవీగుతూ వస్తున్న మాస్ రాజా ‘వీర’
మాస్ మహా రాజా రవితేజ హీరోగా సాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ వర్మ దర్శకత్వంలో గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ 'వీర' మే 20 న విడుదల కానుంది. రవితేజ హీరోగా, కాజల్, తాప్సి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'వీర' చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో ముగిసింది. కాగా, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట్లో ఈనెల 19న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, కొంత వర్క్ మిగిలివుండడం వల్ల ఒక రోజు లేట్ గా అంటే... ఈనెల 20న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత మీడియాకు తెలియజేశారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. గతంలో రవితేజ విక్రమార్కుడు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గణేష్ ఇందుకూరి మాట్లాడుతూ 'రవితేజ పెర్ఫార్మెన్స్, కాజల్, తాప్సీల గ్లామర్, తమన్ మ్యూజిక్, చోట కే నాయుడు ఫోటోగ్రఫి, రమేష్ వర్మ టేకింగ్ హైలైట్స్ గా మా 'వీర' మే 20న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. రవితేజ సూపర్ హిట్స్ లో మరో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా రమేష్ వర్మకు దర్శకుడిగా బిగ్ కమర్షియల్ బ్రేక్ ఇచ్చే చిత్రంగా వస్తోంది. ఇటీవల విడుదల అయిన ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఈ ఆడియో ఇంత పెద్ద విజయం సాధించిన నేపధ్యంలో ఈ వారం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేస్తున్నాం. ఈ చిత్రం తప్పకుండా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకు వుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











